చైనాలోని వుహన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాను అల్లకల్లోలం చేస్తోంది. రోజూ వేలాది మందికి ఈ వైరస్ సోకుతోంది. ఇప్పటికే యూఎస్ లో కరోనా పాజిటివ్ కేసులు 10 లక్షలు దాటాయి. అందులో 59 వేల మందికి పైగా మరణించారు. ఈ పరిస్థితులను చూసి భారత్ లాంటి దేశాల్లో కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన అమెరికన్ స్వదేశం వెళ్లేందుకు జంకుతున్నారు. ఇండియానే సేఫ్ అని ఫీలవుతున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్ కావడంతో విదేశాల్లో చిక్కుకుపోయన తమ దేశీయులను తీసుకెళ్లేందుకు అమెరికా స్పెషల్ ఫ్లైస్ట్ పంపుతోంది. భారత్ లో ఉన్న అమెరికన్స్ కొద్ది రోజుల క్రితం ఈ ప్రత్యేక విమానాల్లో వెనక్కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే తమ దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తుండడంతో భారత్ లో చాలా వరకు కంట్రోల్ లో ఉన్నందున్న ఇక్కడ ఉండడమే సేఫ్ అని భావిస్తున్నారు. తిరుగు ప్రయాణానికి నో అంటున్నారు.
స్పెషల్ ఫ్లైట్స్ పెట్టినా.. ఇండియాలోనే ఉంటామంటూ..
ఢిల్లీ, ముంబై సహా పలు సిటీల్లో ఉన్న అమెరిన్లు రెండు వారాల క్రితం వేలాది మంది స్పెషల్ ఫ్లైట్స్ లో తిరుగు ప్రయాణానికి రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఐయాన్ బ్రౌన్లీ. అయితే కొద్ది రోజుల నుంచి తాము ఇండియాలోనే ఉంటామని చాలా రిక్వెస్ట్ లు వస్తున్నాయని తెలిపారు. తాము వారిని ఇళ్లకు చేరుస్తామని చెబుతున్నా.. చాలా మంది స్పందించడం లేదన్నారు. ఇప్పటికే అమెరికా వచ్చేందుకు సిద్ధపడిన వాళ్లు కూడా తాము రావాలనుకోవడం లేదని చెబుతున్నారని చెప్పారు బ్రౌన్లీ.