ఇలా అవమానించారేంటి బ్రో.. ఎయిర్ పోర్టు నుంచే పాక్ దౌత్యవేత్తను వెనక్కి పంపిన అమెరికా

ఇలా అవమానించారేంటి బ్రో.. ఎయిర్ పోర్టు నుంచే పాక్ దౌత్యవేత్తను వెనక్కి పంపిన అమెరికా

వాషింగ్టన్: పాకిస్తాన్ సీనియర్ దౌత్యవేత్తను అమెరికా ప్రభుత్వం తమ దేశంలోకి రానివ్వలేదు. ఎయిర్ పోర్ట్‏లో నుంచే వెనక్కి పంపింది. చెల్లుబాటయ్యే వీసా, ఇతర పత్రాలు ఉన్నప్పటికి అమెరికాలోకి ఎంటర్ కానివ్వలేదు. తుర్కిమెనిస్తాన్‎లో పాక్ రాయబారిగా పనిచేస్తున్న కెకె. వాగన్‎కు ఈ పరిస్థితి ఎదురైంది. సెలవులు గడిపేందుకు అమెరికాకు వెళ్లిన వాగన్‎​ను లాస్ ఏంజెలెస్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని డిపోర్ట్ చేశారు. ఆయన వీసాలో కొన్ని వివాదాస్పద అంశాలను గుర్తించడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.