US Elections: ఇంకా పదిరోజులే ఉన్నాయి.. అమెరికన్లు ట్రంప్ వైపా..హారీస్ వైపా..? పోల్స్ ఏం చెబుతున్నాయంటే

US Elections: ఇంకా పదిరోజులే ఉన్నాయి.. అమెరికన్లు ట్రంప్ వైపా..హారీస్ వైపా..? పోల్స్ ఏం చెబుతున్నాయంటే

అమెరికాలో ఎన్నికల పోలింగ్ రోజు దగ్గర పడుతోంది. ఇంకా 10 రోజులే ఉన్నాయి. వైట్ హౌజ్ రేసులో వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్ , మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. విన్నింగ్ ఫ్యాక్టర్ ను డిసైడ్ చేసే కీలక రాష్ట్రాల్లో  ఇద్దరి మధ్య పోటీ గట్టిగానే ఉంది. 

వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్ తరపు అమెరికాలోని ప్రముఖ సింగర్లు బెయాన్స్ నోలెస్, కెల్లీ రోలాండ్, కంట్రీ సింగర్ విల్లీ నెల్సన్లు తమ స్టార్ పవర్ ను ఉపయోగించి కమలా హారీస్ తరపున ఓటర్లు ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. మరోవైపు మాజీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అతని సర్రోగేట్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 

పోల్స్ ఏం చెబుతున్నాయంటే..

అక్టోబర్ 20 నుంచి 23 వరకు న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ నిర్వహించిన తాజా నేషనల్ పోల్స్ లో హారీస్ , ట్రంప్ జాతీయంగా 48 శాతంతో సమానంగా ఉన్నారు. మిగిలిన 4 శాతం ఇంకా తేలలేదు. 

అయితే వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్ కు అమెరికన్ మహిళా ఓటర్లు మద్దతు చాలా బలంగా కనిపిస్తోంది. ట్రంప్ పై హారీస్ ఆధిక్యాన్ని కలిగి ఉన్నారు. 54 శాతం హారీస్ కు మద్దతు ఉండగా.. ట్రంప్ 42 శాతం ఉంది. మరోవైపు పురుషుల మద్దతు డోనాల్డ్ ట్రంప్ కే కనిపిస్తోంది. 41 శాతం  మంది పురుషులు హారీస్ కు మద్దతు పలకగా.. 55 శాతం మంది డోనాల్డ్ ట్రంప్ కు మద్దతు పలికారు. 

హారీస్ 18 నుంచి 29 యేళ్ల వయసు గల ఓటర్ల నుంచి అత్యధికంగా మద్దతును పొందారు. ఈ వయస్సు ఓటర్లు 43 శాతం ట్రంప్ కు సపోర్ట్ చేయగా.. 55 శాతం హారీస్ కు మద్దతు ఇస్తున్నారు. అయితే 45 యేళ్లనుంచి 64 యేళ్ల మధ్య వయస్కులు మాత్రం ట్రంప్ కు జై కొడుతున్నారు. 51 శాతం ట్రంప్ కు మద్దతివ్వగా 44 శాతం కమలా హారీస్ కు ఓకే చెబుతున్నారు. 

ALSO READ | సంధికి సిద్ధం! కాల్పుల విరమణ దిశగా హమాస్-ఇజ్రాయెల్ అడుగులు

FiveThirtyEight  పోల్ ట్రాకర్ అనే జాతీయ పోల్‌సరాసరిని లెక్కించింది.హారిస్ 48 శాతం, ట్రంప్ 46.6 శాతంలో ఉన్నారు. ఇద్దరి మధ్య స్వల్ప ఆధిక్యం ఉంది. గతవారంతో పోల్చితే ఈ వారం  కమలా హారీస్ మెజార్టీ చాలా స్వల్పంగా ఉందని తెలిపింది. 

జాతీయ సర్వేలు ఓటరు సెంటిమెంట్‌అంచనా వేస్తుండగా.. అంతిమ విజేతను మాత్రం ఎలక్టోరల్ కాలేజీ నిర్ణయిస్తుంది. అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ ఎన్నికలను నిర్ణయించగల ఏడు కీలక స్వింగ్ రాష్ట్రాలు. మొత్తంగా ఈ రాష్ట్రాలు ఎన్నికలలో గెలవడానికి అవసరమైన 270 ఎలక్టోరల్ కాలేజీలో 93 - లేదా మూడవ వంతు ఉన్నాయి.

FiveThirtyEight తాజా పోల్ సగటు ప్రకారం..ట్రంప్‌కు నార్త్ కరోలినాలో 1 శాతం, అరిజోనా,జార్జియాలో 2 శాతం ఎడ్జ్ ఉంది. మిచిగాన్, నెవాడా, పెన్సిల్వేనియా , విస్కాన్సిన్‌లలో హారిస్, ట్రంప్‌ 0.50శాతం కంటే తక్కువ పాయింట్ ఉంది.పెన్సిల్వేనియా , నెవాడాలో ట్రంప్ స్వల్పంగా ముందంజలో ఉన్నారు, మిచిగాన్ , విస్కాన్సిన్‌లలో చాలా స్వల్ప మెజార్టీతో హారిస్ ఉన్నా రు.