US Election Results : ట్రంప్ 232, హారిస్ 211.. నువ్వానేనా అన్నట్లు ఫలితాలు

US Election Results : ట్రంప్ 232, హారిస్ 211.. నువ్వానేనా అన్నట్లు ఫలితాలు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. 23 రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ విజయం సాధించగా.. 13 స్టేట్లలో డెమొక్రటిక్ అభ్యర్థిని కమలా హ్యారిస్ గెలుపు కైవసం చేసుకున్నారు. ఎర్లీ ట్రెండ్స్‌లో ట్రంప్‌కు 232, హారిస్‌కు 211 ఎలక్టోరల్‌ ఓట్లు లభించాయి. 

అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. మ్యాజిక్ ఫిగర్‎కు ట్రంప్ దగ్గరలో ఉన్నారు. తొలుత వెనకంజలో ఉన్న కమలా హ్యారిస్ అనూహ్యంగా పుంజుకున్నారు. ట్రంప్‎కు ధీటుగా కమలా హ్యారిస్ రేసులోకి వచ్చారు. కమలా విజృంభణతో ట్రంప్ వర్గంలో ఆందోళన నెలకొంది. 

కమలా హ్యారిస్ ఇల్లినోయి, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, డేలావేర్, మాసుచుసెట్స్, కొలరాడో, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాను సొంత చేసుకున్నారు. కమలా హ్యారిస్ 13 రాష్ట్రాలను కైవసం చేసుకున్నారు. అంత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియా, పెన్సిల్వేనియాలోనూ ట్రంప్ లీడ్‎లో ఉన్నారు. ట్రంప్ మొదటగా పెన్సిల్వేనియాలో వెనుకబడగా..ఆతర్వాత లీడ్‎లోకి వచ్చారు.

ఇక పాపులర్ ఓట్లలోనూ ట్రంప్ కు క్లియర్ మెజార్టీ కనిపిస్తోంది. మరోవైపు ఫిలడెల్ఫియా ఎన్నికల్లో మోసం జరిగిందన్న ఆరోపణలు తోసిపుచ్చారు ఎన్నికల అధికారులు. భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటీవ్స్ లో విజయం సాధించారు. ఇల్లినోయి 8వ కాంగ్రెస్ షనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు.