యూఎస్ ఎలక్షన్ రిజల్ట్స్: 10 రాష్ట్రాల్లో ట్రంప్ ఘన విజయం

యూఎస్ ఎలక్షన్ రిజల్ట్స్: 10 రాష్ట్రాల్లో ట్రంప్ ఘన విజయం

వాషింగ్టన్ డీసీ: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ఎవరనేది 2024 నవంబర్ 6న తేలనుంది. అమెరికా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల మధ్య నెక్ టు నెక్ ఫైట్ నెలకొంది.   పోలింగ్ పూర్తి అయిన రాష్ట్రాల్లో వెంటనే అధికారులు కౌంటింగ్ మొదలు పెట్టారు. 

ఇప్పటి వరకు 18 రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 10 రాష్ట్రాల్లో విజయం సాధించగా.. డెమొక్రటిక్ క్యాండిడేట్ కమలా హ్యారిస్ 8 స్టేట్లలో గెలుపొందారు. ఎలక్టోరల్ ఓట్ల పరంగా చూస్తే.. డొనాల్డ్ ట్రంప్ 177, కమలా హ్యారిస్‎కు 99 ఓట్లు పడ్డాయి. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. 276 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. 

అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఫలితాల నేపథ్యంలో ఆ దేశ స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు చోటు చేసుకుంటున్నాయి. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్‎లో డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో దూసుకుపోతుండటంతో.. ట్రంప్ కంపెనీలకు చెందిన షేర్లు భారీగా పుంజుకున్నాయి. ట్రంప్ షేర్లు భారీ లాభాలు నమోదు చేయడంతో అమెరికా స్టాక్ మార్కెట్ దూసుకుపోతోంది. 

ట్రంప్ గెలిచిన రాష్ట్రాలు:

  • ఆలబామా
  •  ఆర్కాన్సాస్
  •  ఫ్లోరిడా
  •  ఇండియానా
  •  కెంటకీ
  •  మిసిసిపీ
  • ఓక్లహోమా
  •  టెన్నెసీ
  • వర్జీనియా
  •  సౌత్ కరోలినా

కమలా గెలిచిన రాష్ట్రాలు:

  • కనెక్టికట్
  •  డెలవేర్
  •  ఇల్లినోయా
  •  మసాచుసెట్స్
  •  మేరీ ల్యాండ్
  •  న్యూజెర్సీ
  •  రోడ్ ఐల్యాండ్
  •  వెర్మాంట్