అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో తాను ఓడిపోతే అమెరికా అధ్యక్ష పదవికి వరుసగా నాలుగోసారి పోటీచేయబోనని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.
ALSO READ : జో బైడెన్ దంపతులకు మోదీ అరుదైన బహుమతులు
అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ US వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కి వ్యతిరేకంగా ట్రంప్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. కమలా హారీస్, ట్రంప్ మధ్య నువ్వానేనా అన్నట్లుగా పోటీ ఉందని సర్వేలు చెబుతున్నాయి. 2020 ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రచారాన్ని ట్రంప్ ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు.