దక్షిణాఫ్రికా రాయబారిపై అమెరికా బహిష్కరణ వేటు.. ట్రంప్ పాలనపై వ్యాఖ్యల ఫలితం

దక్షిణాఫ్రికా రాయబారిపై అమెరికా బహిష్కరణ వేటు.. ట్రంప్ పాలనపై వ్యాఖ్యల ఫలితం

న్యూయార్క్: విదేశాలపై సుంకాల విధింపుతో దూకుడుగా వ్యవహరిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​... వివిధ దేశాలకు చెందిన రాయబారులపైనా బహిష్కరణ వేటు చేస్తున్నారు. ఇటీవలే తుర్క్ మెనిస్థాన్​ లో పాక్​ రాయబారిగా ఉన్న ఎసాన్​ కు యూఎస్ లోకి అనుమతి నిరాకరించి, వెనక్కి పంపిన అమెరికా... తాజాగా యూఎస్ లోని దక్షిణాఫ్రికా రాయబారి ఇబ్రహీం రసూల్​ పై వేటు వేసింది. ఇబ్రహీం రసూల్​ 2010 నుంచి 2015 వరకు అమెరికాలో దక్షిణాఫ్రికా రాయబారిగా పని చేశారు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో తిరిగి ఆ పదవిని చేపట్టారు.

ALSO READ | Trump: ఇంటర్నెట్ ను షేక్ చేసిన ఎలాన్ మస్క్ కొడుకు, ట్రంప్ వీడియో..ఎలాన్ మస్క్ పుత్రోత్రాహం..

'దక్షిణాఫ్రికా రాయబారి ఇబ్రహీం రసూల్​ ఈ దేశంలో ఉండేందుకు ఆహ్వానించదగిన వ్యక్తి కాదు. అధ్యక్షుడు ట్రంప్ ను ద్వేషించే వ్యక్తి. ఆయన ఒక జాతి విద్వేష రాజకీయ నాయకుడు. దీనిపై ఆయనతో చర్చించాల్సింది ఏమీ లేదు' అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో పేర్కొన్నారు.  రసూల్​ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొని ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. దీని కారణంగానే ఆయన్ను బహిష్కరించినట్లు తెలుస్తోంది.