గ్రాన్యుల్స్‌‌కు ఎఫ్‌‌డీఏ వార్నింగ్ లెటర్‌‌‌‌

గ్రాన్యుల్స్‌‌కు ఎఫ్‌‌డీఏ వార్నింగ్ లెటర్‌‌‌‌

న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ గ్రాన్యుల్స్‌‌ ఇండియాకు యూఎస్ ఎఫ్‌‌డీఏ వార్నింగ్‌‌ లెటర్ పంపింది. కంపెనీకి చెందిన హైదరాబాద్ ప్లాంట్‌‌లో డ్రగ్ స్టోరేజ్‌‌ బిల్డింగ్స్ సరిగ్గాలేవని, ఎక్విప్‌‌మెంట్లు క్లీన్‌‌గా లేవని, మెయింటెనెన్స్ సరిగ్గా లేదని పేర్కొంది.   కిందటేడాది ఆగస్టు 26–సెప్టెంబర్ 6 మధ్య  గ్రాన్యుల్స్ ప్లాంట్‌‌ను యూఎస్‌‌ ఎఫ్‌‌డీఏ అధికారులు పరిశీలించారు. కలుషితాన్ని నివారించేందుకు ఫిల్టర్లు వాడుతున్నా, క్లీనింగ్, మెయింటెనెన్స్ ప్రాసెస్ సరిగ్గా లేదని కంపెనీ  చైర్మన్‌‌ క్రిష్ణ ప్రసాద్‌‌కు  పంపిన వార్నింగ్ లెటర్‌‌‌‌లో ఎఫ్‌‌డీఏ పేర్కొంది.

 డ్రగ్స్ స్టోర్ చేయాల్సిన బిల్డింగ్‌‌ల పరిస్థితి బాగోలేదని తెలిపింది. ఇన్‌‌స్పెక్షన్ టైమ్‌‌లో బిల్డింగ్‌‌లో  పక్షుల ఈకలు, విసర్జాలు గుర్తించామని, ముఖ్యంగా ఫ్యాక్టరీలోని   ఎయిర్ ప్యూరిఫికేషన్ యూనిట్లు, ఫ్లోర్‌‌‌‌పై  ఇవి కనిపించాయిని  పేర్కొంది.