సన్​ఫార్మాకు యూఎస్​ ​ఎఫ్​డీఏ వార్నింగ్​

సన్​ఫార్మాకు యూఎస్​ ​ఎఫ్​డీఏ వార్నింగ్​

న్యూఢిల్లీ:  సన్ ఫార్మా  దాద్రా ప్లాంటులో డ్రగ్స్​ తయారీకి ఉపయోగించే పరికరాలను తగినంతగా శుభ్రపరచడంలో, సరిగ్గా నిర్వహించడంలో విఫలమైందని పేర్కొంటూ యూఎస్​ఎఫ్​డీఏ వార్నింగ్ వచ్చింది. ఈమేరకు  జూన్ 18న కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ షాంఘ్వీకి వార్నింగ్​ లెటర్​ పంపించింది. యూఎస్ హెల్త్ రెగ్యులేటర్ 2023 డిసెంబర్ 4-–15 మధ్య దాద్రా  నగర్ హవేలీ,  డామన్  డయ్యూ కేంద్రపాలిత ప్రాంతంలోని ప్లాంట్‌‌ను తనిఖీ చేశాక ఈ నిర్ణయం తీసుకుంది. 

 కాలుష్యాన్ని నివారించడానికి పరికరాలను,  పాత్రలను శుభ్రపరచడం, నిర్వహించడంలో సంస్థ విఫలమైందని పేర్కొంది. ఫినిష్డ్​ఫార్మాస్యూటికల్స్​కు సంబంధించిన కరెంట్ గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (సీజీఎంపీ) నిబంధనలను పాటించడం లేదని విమర్శించింది.