అంచనాలను అందుకోని యూఎస్ జీడీపీ గ్రోత్‌‌‌‌‌‌‌‌

అంచనాలను అందుకోని యూఎస్ జీడీపీ గ్రోత్‌‌‌‌‌‌‌‌
  • డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో 2.3 % వృద్ధి
  • యదాతథంగా ఫెడ్ వడ్డీ రేటు  

న్యూఢిల్లీ: యూఎస్ జీడీపీ గ్రోత్ కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌–డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో అంచనాలను అందుకోలేకపోయింది. జీడీపీ 2.5 శాతం వృద్ధి చెందుతుందని ఎనలిస్టులు అంచనా వేయగా, 2.3 శాతమే వృద్ధి చెందింది. 2024 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో యూఎస్ జీడీపీ 3.1 శాతం పెరిగింది. 

ఏడాది మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే యూఎస్‌‌‌‌ జీడీపీ గ్రోత్ రేట్ 2024 లో 2.8 శాతంగా నమోదైంది. 2023 లో 2.9 శాతం గ్రోత్ నమోదు చేసింది. మరోవైపు  ప్రెసిడెంట్ ట్రంప్ వడ్డీ రేట్లను తగ్గించాలని చెబుతున్నా, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మాత్రం తాజా పాలసీ మీటింగ్‌‌‌‌లో  వడ్డీ రేట్లను తగ్గించలేదు. 

4.25 శాతం–4.50 శాతం దగ్గర యదాతథంగా కొనసాగించింది. ఇన్‌‌‌‌ఫ్లేషన్ ఇంకా గరిష్టాల్లో ఉందని, ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొందని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్  పేర్కొన్నారు.