ఇండియన్ గ్రాడ్యుయేట్లకూ గోల్డ్ కార్డ్.. అమెరికాలో చదువుతున్నోళ్లకు ఛాన్స్

ఇండియన్ గ్రాడ్యుయేట్లకూ గోల్డ్ కార్డ్.. అమెరికాలో చదువుతున్నోళ్లకు ఛాన్స్
  • వాళ్లను అమెరికన్ కంపెనీలు రిక్రూట్ చేస్కోవచ్చు: ట్రంప్ 
  • అమెరికాలోని టాప్ వర్సిటీల్లో చదువుతున్నోళ్లకే చాన్స్ 

వాషింగ్టన్: అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న ఇండియన్ గ్రాడ్యుయేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్యూస్ చెప్పారు. ఆ వర్సిటీల్లోని గ్రాడ్యుయేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొత్తగా తీసుకొచ్చిన ‘గోల్డ్ కార్డ్’ వీసా స్కీమ్ కింద అమెరికన్ కంపెనీలు రిక్రూట్ చేసుకోవచ్చని ఆయన ప్రకటించారు. బుధవారం వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా గోల్డ్ కార్డ్ వీసా స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై క్లారిటీ ఇచ్చారు. 

‘‘ఇండియా లాంటి దేశాలకు చెందిన టాలెంటెడ్ పీపుల్ అమెరికాలో ఉండి వర్క్ చేసేందుకు ప్రస్తుతమున్న ఇమిగ్రేషన్ సిస్టమ్ అడ్డంకిగా మారింది. ఇండియా, చైనా, జపాన్ తదితర దేశాల నుంచి స్టూడెంట్లు వచ్చి హార్వర్డ్, వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ లాంటి టాప్ విద్యాసంస్థల్లో చదువుకుంటారు. వాళ్లు జాబ్ ఆఫర్స్ అందుకుంటారు. కానీ అవి వెంటనే రద్దవుతాయి. ఎందుకంటే వాళ్లు అమెరికాలోనే ఉంటారా? లేదా? అనే దానిపై క్లారిటీ ఉండదు. దీనివల్ల చాలామంది టాలెంటెడ్ గ్రాడ్యుయేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిరిగి తమ సొంత దేశాలకు వెళ్లిపోతున్నారు. అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతున్నారు. బిలియనీర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎదుగుతున్నారు. వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇప్పుడు గోల్డ్ కార్డ్ వీసా స్కీమ్ కింద అలాంటి టాలెంటెడ్ పీపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమెరికన్ కంపెనీలు నియమించుకోవచ్చు. గోల్డ్ కార్డులను కొనుగోలు చేసి, దీన్నొక రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రక్రియగా ఉపయోగించుకోవచ్చు” అని తెలిపారు. ఈ స్కీమ్ రెండు వారాల్లో ప్రారంభమవుతుందని
వెల్లడించారు. 

ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్ అథ్లెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నో ఎంట్రీ!  

అమెరికాలోకి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్ అథ్లెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకుండా ట్రంప్ సర్కార్ నిషేధం విధించింది. ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్ అథ్లెట్స్ వీసా అప్లికేషన్లను తిరస్కరించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కాన్సులేట్ ఆఫీసులకు ట్రంప్ ఆఫీస్ ఆదేశాలు ఇచ్చినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. కాగా, అమెరికాలో విమెన్ స్పోర్ట్స్ ఈవెంట్లలో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్లు పాల్గొనకుండా నిషేధం విధిస్తూ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ట్రంప్ ఉత్తర్వులు ఇచ్చారు.