అమెరికన్లూ..జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పోవొద్దు

 అమెరికన్లూ..జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పోవొద్దు
  • తమ పౌరులకు యూఎస్ ప్రభుత్వం సూచన 

న్యూయార్క్: పహల్గాంలో పర్యాటకులను టెర్రరిస్టులు కాల్చి చంపిన నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ కు వెళ్లవద్దని తన దేశ పౌరులకు అమెరికా ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు యూఎస్  విదేశాంగ శాఖ బుధవారం అడ్వైజరీని జారీ చేసింది. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో కాశ్మీర్ తో పాటు ఇండియా–పాకిస్తాన్  సరిహద్దులకు పది కిలోమీటర్ల పరిధిలో హింస నెలకొనే ప్రమాదం ఉందని పేర్కొంది. నియంత్రణ రేఖతో పాటు శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గాంలో హింస పెరిగిపోయే ప్రమాదంఉందని తెలిపింది.  2019లో పుల్వామా తరువాత జరిగిన అతిపెద్ద దాడిగా వర్ణించింది. అయితే, ఈస్టర్న్  లద్దాఖ్, దాని రాజధాని లేహ్ లో పర్యటించవచ్చని సూచించింది.