హెచ్1బీ వీసా లాటరీ సిస్టంలో మోసాలు

హెచ్1బీ వీసా లాటరీ సిస్టంలో మోసాలు

వాషింగ్టన్: అమెరికన్ టెక్నాలజీ కంపెనీలు హెచ్1బీ వీసాలను ఎక్కువగా పొందడం కోసం మోసాలకు పాల్పడుతుండటంతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్​ను ఆధునీకరించను న్నట్లు ఆ దేశం ప్రకటించింది. ఇండియా, చైనా తదితర దేశాల నుంచి ఐటీ, ఇతర స్కిల్స్ గల ఉద్యోగులను ఎక్కువగా రప్పించుకు నేందుకు అనేక కంపెనీలు హెచ్1బీ వీసా లాటరీ సిస్టంను దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించామని శుక్రవారం యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. కంప్యూటరైజ్డ్ లాటరీ సిస్టంలో వీసాలు ఎక్కువగా పొందడానికి కంపెనీలు ఒకే ఉద్యోగి పేరిపై ఒకటి కన్నా ఎక్కువ రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నాయని చెప్పింది. తప్పుడు వివరాలతో, ఫాల్స్ అటెస్టేషన్​తో సమర్పించే అప్లికేషన్లను రిజెక్ట్ చేయడంతో పాటు కంపెనీలపై దర్యాప్తు కు రిఫర్ చేస్తామని  హెచ్చరించింది.