
అమెరికాలో ఫెడరల్ ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ట్రంప్ రెండో సారి అధికారం చేపట్టాక అన్ని శాఖల్లో బ్యూరోక్రాట్లతో సహా ఫెడరల్ ఉద్యోగులను తొల గిస్తున్నారు. ఇప్పటికే అనేక డిపార్టుమెంట్లతో ఉద్యోగులను తొలగించిన ట్రంప్. తాజాగా హెల్త్ డిపార్టుమెంట్ లోని ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్దమయ్యారు.
ట్రంఫ్ ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖలో 10వేల ఉద్యోగాలను తగ్గిస్తామని, వాట సగం ఆఫీసులు మూసివేస్తామని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ ప్రకటించారు. ఈ కోతలు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ మరియు సెంటర్స్ ఫర్ మెడికేర్ అండ్ మెడికైడ్ సర్వీసెస్‌లకు చెందిన ఉద్యోగులపై ప్రభావం చూపనుంది.
ఆరోగ్య శాఖలో 82వేలనుంచి 62 వేలకు తగ్గిన ఉద్యోగులు
ప్రస్తుతం అమెరికా ఆరోగ్య శాఖలో 82 వేల మంది ఉద్యోగులుండగా.. పదివేల మందిని తొలగించనున్నారు. గతంలో స్వచ్ఛందంగా 10వేల మంది ఉద్యోగాలు వదులుకున్నారు. ఈ తొలగింపులతో ప్రస్తుతం హెల్త్ డిపార్టుమెంటులో ఉద్యోగుల సంఖ్య 62వేలకు చేరుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో పోరాడటానికి ఆరోగ్య శాఖను తిరిగి దిశానిర్దేశం చేస్తున్నట్లు కెన్నెడీ చెప్పారు.
వాల్ స్ట్రీట్ జర్నరల్ రిపోర్టు ప్రకారం.. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ,సెంటర్స్ ఫర్ మెడికేర్ అండ్ మెడికేడ్ సర్వీసెస్ విభాగాలలో విస్తరించి ఉన్న 10వేల మంది ఫుల్ టైం ఉద్యోగులను తొలగించనున్నారు.
ట్రంప్ అధికారంలో చేపట్టాక అధికారిక విస్తరణలో భాగంగా ఫెడరల్ ఉద్యోగుల తొలగింపులు చేపట్టారు. బిలియనీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రభుత్వ సమర్థత విభాగం (DOGE) ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫెడరల్ వ్యయాన్ని తగ్గించే లక్ష్యంతో పనిచేస్తుంది.