వాషింగ్టన్: భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల మధ్య సహకార సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఉద్దేశించిన క్వాడ్ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. దీంతో క్వాడ్ కూటమి దేశాల మధ్య క్వాడ్ ఇంట్రా పార్లమెంటరీ వర్కింగ్ గ్రూప్ ను బైడెన్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. క్వాడ్ దేశాల మధ్య ఉమ్మడి సహకార సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని బిల్లులో పేర్కొన్నారు.
బిల్లు చట్టరూపం దాల్చడానికి 180 రోజుల ముందు క్వాడ్ దేశాల మధ్య సంబంధాలను విస్తృతం చేసేందుకు తగిన వ్యూహం రూపొందించాలని, అలాగే బిల్లు చట్టరూపం దాల్చిన 60 రోజుల్లోపు కూటమి దేశాలతో సంప్రదింపులు జరిపేందుకు క్వాడ్ ఇంట్రా పార్లమెంటరీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని విదేశాంగ శాఖను బిల్లులో ఆదేశించారు. కాగా, ఇద్దరు డెమొక్రటిక్ నేతలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.