అమెరికాలో Tik Tok బ్యాన్..! నిషేధం బిల్లుకు సెనెట్ ఆమోదం

షార్ట్ వీడియో యాప్ Tik Tok ను నిషేధించేందుకు టిక్ టాక్ నిషేధ బిల్లుకు అమెరికా సెనెట్ బుధవారం ( మార్చి 13) న ఆమోదం తెలిపింది. మొత్తం ఈ బిల్లుకు 352 ఓట్లు అనుకూలంగా రాగా.. వ్యతిరేకంగా 65 ఓట్లు వచ్చాయి. బిల్లుకు సెనెట్ ఆమోదం లభిస్తే చట్టంగా సంతకం చేస్తానని ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చెప్పారు. ఈ యాప్ జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యలను కలిగిస్తోందంటూ టిక్ టాక్ ను అమెరికాలో నిషేధించాలని సెనెట్ బిల్లుకు ఆమోదం తెలిపింది.

టిక్ టాక్ యాప్ ని అమెరికా ఎందుకు నిషేధించాలనుకుంటుందంటే.. ఈ యాప్ కి మాతృ సంస్థ చైనాకు చెందిన బైట్ డాన్స్.. దీంతో సంబంధాలు తెగ్గొట్టు కోవాలని గత కొంతకాలంగా అమెరికా టిక్ టాక్ సంస్థపై ఒత్తిడి తెస్తోంది. ఈ క్రమంలో బిల్లుకు అమెరికి సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ సంస్థ బైట్ డాన్స్ తో తెగతెంపులు చేసుకోకపోతే హౌస్ గ్రీన్ లైట్ చేసిన చట్టం యూఎస్ లో టిక్ టాక్ నిషేధం అవకాశాలు ఎక్కువే అంటున్నారు అమెరికన్లు.. 170 మిలియన్ల అమెరికన్ యూజర్లు ఉన్న  అతిపెద్ద సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ టిక్ టాక్.