
వాషింగ్టన్: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. టెర్రర్ అటాక్ నేపథ్యంలో పాక్ కు వ్యతిరేకంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో, ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న దశలో అమెరికా స్పందించింది. రెండు దేశాలు పరిస్థితిని సామరస్యంగా చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలని యూఎస్ సూచించింది.
ఈ మేరకు అమెరికా విదేశాంగ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘భారత్, పాక్ మధ్య జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
ఈ టైంలో రెండు పార్టీలూ సామరస్య వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది” అని యూఎస్ పేర్కొంది. అలాగే, పహల్గాం టెర్రర్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మరోసారి తెలిపింది.