
అమెరికాలో ఇండియన్ సంతతికి చెందిన క్యాథలిక్ మతప్రచారకుడు హత్యకు గురయ్యాడు. గురువారం(ఏప్రిల్4) కాన్సాస్ రాష్ట్రంలోని సెనెకాలో క్యాథిలిక్ మతబోధకుడు అరుల్ కరసాలపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మతబోధకుడిగా అరుల్ కరసాలకు మంచి గుర్తింపు ఉంది. అరుల్ కరసాల మృతిని కాన్సాస్‌లోని కాన్సాస్ నగర ఆర్చ్‌డయోసెస్ ఆర్చ్‌బిషప్ జోసెఫ్ నౌమాన్ ధృవీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.