తగ్గిన యూఎస్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌

తగ్గిన యూఎస్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ:  గ్యాస్ ధరలు తగ్గడంతో  అమెరికాలో ఈ ఏడాది మార్చిలో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ దిగొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏడాది లెక్కన 2.8 శాతంగా నమోదైన కన్జూమర్ ప్రైస్‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్ (సీపీఐ) మార్చిలో 2.4 శాతానికి తగ్గింది.  నెల ప్రాతిపదికన 0.1 శాతం తగ్గింది. ఫిబ్రవరిలో కూడా ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ తగ్గిన విషయం తెలిసిందే.

ఎలక్ట్రిసిటీ, నేచురల్ గ్యాస్ ధరలు పెరిగినా,  గ్యాసోలిన్ ధరలు తగ్గడంతో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ దిగొచ్చిందని యూఎస్ ప్రభుత్వం ప్రకటించింది.   ఆహార పదార్థాల ధరల పెరుగుదలను కొలిచే ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ 0.4 శాతం పెరిగిందని తెలిపింది.