యూఎస్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ 2.7 శాతం

యూఎస్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ 2.7 శాతం

న్యూఢిల్లీ: యూఎస్‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ ఈ ఏడాది నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొద్దిగా పెరిగింది. అన్ని ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ల ధరలను కొలిచే  కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  0.3 శాతం పెరగగా, యాన్యువల్ బేసిస్‌‌‌‌లో  2.7 శాతానికి చేరుకుంది. 

ఈ ఏడాది  అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీపీఐ 2.6 శాతంగా ఉంది.  కోర్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్  కిందటి నెలలో  నెల ప్రాతిపదికన 0.3 శాతం పెరగగా, ఏడాది ప్రాతిపదికన3.3 శాతానికి చేరుకుంది. ఇన్‌‌‌‌ఫ్లేషన్ పెరగడంతో ఫెడ్ వడ్డీ రేట్ల కోతకు బ్రేక్ పడొచ్చు.