రేప్ చేసి తగులబెట్టేశారు! .. ఇజ్రాయెల్ మహిళలపైహమాస్ మిలిటెంట్ల దారుణాలు

టెల్అవీవ్: ఇజ్రాయెల్ మహిళల పట్ల హమాస్ మిలిటెంట్లు చాలా దారుణంగా ప్రవర్తించారు. అక్టోబర్ 7న దాడి తర్వాత.. మిలిటెంట్లు ఇజ్రాయెల్ మహిళలను రేప్ చేసి.. వాళ్ల ఫేస్​పై పెట్రోల్ పోసి కాల్చేశారని న్యూయార్క్ టైమ్స్ ఇన్వెస్టిగేషన్​లో వెల్లడైంది. హమాస్ దాడి చేసిన అన్ని ప్రదేశాల్లో ఇలాంటి ఘటనలే జరిగాయని తెలిపింది. రెండు నెలల పాటు జరిపిన విచారణ తర్వాత ఈ దారుణం వెలుగులోకొచ్చిందని వివరించింది. సెంట్రల్ ఇజ్రాయెల్​కు చెందిన ఇద్దరు పిల్లల తల్లైన గల్ అబ్దుష్.. మిలిటెంట్ల దాడి రోజు నుంచి కనిపించకుండా పోయింది. తప్పిపోయిన తన ఫ్రెండ్ కోసం ఓ మహిళ వెతుకుతుండగా.. గల్ అబ్దుష్ డెడ్​బాడీ రోడ్డుపై కనిపించింది. 

ఆ టైమ్​లో ఆమె శరీరంపై బట్టల్లేవు. ఫేస్ గుర్తుపట్టలేనంతగా కాలిపోయి ఉంది. దీన్నంతంటినీ సదరు మహిళ వీడియో తీసింది. ఈ వీడియో ఆధారంగా ఇజ్రాయెల్ పోలీసులు ఎంక్వైరీ చేయగా.. హమాస్ దారుణాలు బయటికొచ్చాయి. గాజా సరిహద్దు వద్ద జరిగిన రేవ్ పార్టీకి అటెండ్ అయిన చాలా మంది మహిళలను హమాస్ మిలిటెంట్లు రేప్ చేసి.. ముఖాలు కాల్చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ ఇన్వెస్టిగేషన్ లో స్పష్టమైంది. అక్టోబర్ 7వ తేదీన కనీసం ఏడు ప్రాంతాల్లో మహిళలు, అమ్మాయిలను హమాస్ మిలిటెంట్లు రేప్ చేసి దారుణంగా హత్య చేశారని ఇజ్రాయెల్ పోలీసులు వెల్లడించారు. 

వీపులో కత్తితో పొడుస్తూ..

‘‘ఓ యువతిని దారుణంగా రేప్ చేశారు. ఆమె ప్రతిఘటించినప్పుడల్లా వీపుపై కత్తితో పొడిచారు. ఓ యువతిని రేప్ చేసి ముక్కలుగా నరికేశారు. ముగ్గురు మహిళల తలలు నరికి తీసుకెళ్తుండటం చూశాను. ఓ ప్లేస్​లో దాక్కొని వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీశాను”అని సాపిర్ అనే వ్యక్తి చెప్పాడు. అయితే, మహిళలపై రేప్, దారుణ హత్యలకు సంబంధించిన ఘటనలపై న్యూయార్క్ టైమ్స్ కథనంలో నిజం లేదని హమాస్ ఖండించింది. 

ఒకే చోట 232 మంది మహిళల డెడ్​బాడీలు

గల్ అబ్దుష్ డెడ్​బాడీ దొరికిన రోడ్డు వెంట 232 మంది మహిళలపై అత్యాచారం జరిగినట్టు న్యూయార్క్ టైమ్స్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అందరినీ మిలిటెంట్లు రేప్ చేసి.. పెట్రోల్ పోసి కాల్చేసినట్లు గుర్తించారు. అందరి శరీరాలపై బట్టల్లేవని, ప్రైవేట్ పార్ట్స్ వద్ద గాయాలయ్యాయని, అందరి కాళ్లు ఓపెన్ చేసి కనిపించాయని పోలీసులు వివరించారు. అందరి శరీరాలపై గోళ్లతో రక్కినట్లు, పళ్ల గాట్లు కనిపించాయన్నారు. మరి కొందరి మహిళల ప్రైవేట్ పార్ట్స్​పై హమాస్ మిలిటెంట్లు కాల్పులు జరిపినట్లు గుర్తించారు. అయితే, పోస్టుమార్టం చేయకుండానే డెడ్​బాడీలకు అంతిమ సంస్కారాలు చేయడంతో రేప్ జరిగినట్లు ఎవిడెన్స్ సేకరించలేకపోయాయని తెలిపారు.