గౌతమ్ అదానీపై అమెరికా లంచం ఆరోపణలు..వ్యూహాత్మక తప్పిదమేనా?..

గౌతమ్ అదానీపై అమెరికా లంచం ఆరోపణలు..వ్యూహాత్మక తప్పిదమేనా?..

ఇటీవల ప్రముఖ ఇండియన్ వ్యాపార వేత్త..బిలియనీర్ గౌతమ్ అదానీపై అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ లంచం ఆరోపణలతో కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే..ఇది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. దీనిపై అదానీ గ్రూప్ బాస్ గౌతమ్ అదానీ స్వయంగా వివరణ ఇచ్చారు. ఎటువంటి లంచం, ఆర్థికపరమైన మోసాలకు పాల్పడలేదని గట్టిగా చెప్పారు. ప్రపంచ స్థిరత్వానికి  పశ్చిమ దేశాలతో పొత్తు చాలా కీలకం అయిన సమయంలో ఇలాంటి అమెరికా చర్యలు దౌత్యపరమైన వివాదాలకు దారి తీస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. 

అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ చర్య కేవలం చట్టపరమైన నిర్ణయమే కాదు.. దౌత్యపరమైన తప్పుడు లెక్క అని..బిలియనీర్ గౌతమ్ అదానీపై US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ నేరారోపణ తీవ్రమైన భౌగోళిక రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందని  ప్రముఖ అమెరికన్ ప్రచురణ ఫోర్బ్స్ పేర్కొంది.

The US Harms The West's Alliances With A Far-Flung Indictment In India అనే శీర్షికతో రచయిత, మెలిక్ కైలాన్ రాసిన ఆర్టికల్ లో అదానీపై లంచం ,ఆర్థిక తప్పుగా ఆరోపించిన నేరారోపణ.. పెరుగుతున్న చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి వాషింగ్టన్ బలమైన పొత్తుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో భారత్, అమెరికాల మధ్య సంబంధాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని వాదించారు. 

Also Read : చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌కు పోటీగా అలీబాబా ఏఐ

చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) కి ధీటుగా చేపట్టిన మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) ప్రాజెక్టుకు భారత్ సహకారం ఎంతో అవసరం. పశ్చిమ దేశాలకు భారత్ భాగస్వామ్యం చాలా కీలకం..ఈ క్లిష్ట పరిస్ధితుల్లో DoJ చర్య ఆర్థిక సహకారం, నమ్మకాన్ని  బలహీనపరుస్తుందని స్పష్టం చేశారు. 

ఇది భారత్ ను రష్యా, చైనాలకు దగ్గర చేస్తుందని..అలా చేయడంతో యూఎస్ సొంత భౌగోళిక రాజకీయ శక్తిని బలహీనపరుచుకున్నట్లు అవుతుంది. అంతేకాదు అమెరికా ప్రత్యర్థులను బలం పెంచుకునేందుకు అవకాశం ఇచ్చినట్లే అని మెలిక్ కైలాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.