
- అఫ్గాన్ హోం మంత్రి, హక్కానీ చీఫ్ సిరాజుద్దీన్‌కు ఊరట
- తాలిబాన్లు అమెరికన్ ఖైదీని రిలీజ్ చేయడంతో రివార్డుల రద్దు
కాబూల్/వాషింగ్టన్: అఫ్గానిస్తాన్‌లో గత సర్కారు హయాంలో హక్కానీ నెట్ వర్క్ టెర్రరిస్ట్ సంస్థ ద్వారా మారణహోమానికి పాల్పడిన ముగ్గురు తాలిబాన్ అగ్రనేతలపై ఉన్న బౌంటీల (రివార్డు)లను అమెరికా రద్దు చేసింది. ఇందులో అఫ్గాన్ ప్రస్తుత హోం మంత్రి, హక్కానీ నెట్ వర్క్ చీఫ్ సిరాజుద్దీన్ హక్కానీ, ఆయన సోదరులు అబ్దుల్ అజీజ్ హక్కానీ, యాహ్యా హక్కానీ ఉన్నారు.
కాబూల్‌లోని సెరెనా హోటల్‌పై 2008లో జరిగిన ఉగ్రదాడిలో ఒక అమెరికన్ పౌరుడు సహా ఆరుగురు చనిపోయారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా గుర్తించిన సిరాజుద్దీన్ హక్కానీతోపాటు ఆయన సోదరులపై అమెరికా10 మిలియన్ డాలర్ల(రూ.86 కోట్ల) చొప్పున బౌంటీలు ప్రకటించింది. అయితే, ఇటీవల జరిపిన చర్చలతో అమెరికన్ పౌరుడిని తాలిబాన్లు రిలీజ్ చేశారు. బదులుగా ముగ్గురు నేతలపై బౌంటీలను అమెరికా తొలగించింది.