
దొంగతనం చేయడం.. ఆ తర్వాత పోలీసుల నుండి తప్పించుకునేందుకు దొంగలు తెలివి తేటలు వాడటం చాలా సందర్భాల్లో చూసి ఉంటాం. అయితే.. చాలా సందర్భాల్లో దొంగలు వేసిన ప్లాన్ లు ఫెయిల్ అయ్యి పోలీసుల చేతికి చిక్కుతుంటారు, కానీ.. ఈ దొంగ వేసిన ప్లాన్ కు పోలీసులు సైతం అవాక్కయ్యారు.. మూడు కోట్ల రూపాయల విలువైన డైమండ్ ఇయర్ రింగ్స్ ని దొంగలించిన ఓ కేటుగాడు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు వాటిని మింగేసాడు. ఫ్లోరిడాలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.
గత వారం ఫ్లోరిడాలోని ఓ బంగారు దుకాణంలో దోపిడీ జరిగిందని.. ఈ ఘటనలో టిఫ్ఫాని అండ్ కో బ్రాండ్ కి చెందిన రూ. 6 కోట్ల విలువైన ఇయర్ రింగ్స్ దోపిడీకి గురయ్యాయని.. ఓర్లాండో పోలీసులకు సమాచారం అందింది. లారెన్స్ గ్లైడర్ 32 ఏళ్ళ వ్యక్తి ఈ దోపిడీకి పాల్పడ్డట్లు గుర్తించిన అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అయితే.. అతని నుంచి ఇయర్ రింగ్స్ ను మాత్రం స్వాధీనం చేసుకోలేక పోయారు పోలీసులు. లారెన్స్ పొట్టలో ఉన్న ఇయర్ రింగ్స్ ను గుర్తించలేకపోయిన పోలీసులు అతన్ని దోషిగా నిర్దారించలేకపోయారు. అయితే.. జైలు సిబ్బందితో లారెన్స్ అతని పొట్టలో ఉన్న ఇయర్ రింగ్స్ గురించి ప్రస్తావించడంతో అధికారులు అతనికి స్కానింగ్ చేయగా పొట్టలో ఇయర్ రింగ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత లారెన్స్ కు శిక్ష ఖరారు చేశారు అధికారులు.