ఇది ఫస్ట్ ఫ్లయిట్ మాత్రమే: ఇండియాలో దిగిన అమెరికాలో అక్రమ వలసదారులు

ఇది ఫస్ట్ ఫ్లయిట్ మాత్రమే: ఇండియాలో దిగిన అమెరికాలో అక్రమ వలసదారులు
  • అమృత్ సర్‌కు 104 మంది ఇండియన్స్ ఫ్లైట్
  • అక్రమ వలసదారులను తిప్పి పంపిన అమెరికా

అమృత్ సర్: అమెరికాలో అక్రమంగా వలస ఉన్న 104 మంది భారతీయులను తీసుకొని వచ్చిన విమానం అమృత్  సర్ కు చేరుకుంది. వీళ్లంగా సీ-17 సైనిక విమానంలో ఇండియాకు చేరుకున్నారు. అమెరికాలో అక్రమంగా వలస ఉంటున్న వారిని ఏరివేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 18 వేల మంది భారతీయులు అక్కడ వలస ఉంటున్నట్టు అగ్రరాజ్యం గుర్తించింది. ఈ మేరకు టెక్సాస్ లో నిర్వహించిన అధికారుల ఆపరేషన్ లో 104 మంది చిక్కారు. వారిని సైనిక విమానం ద్వారా అమృత్ సర్ కు తిప్పి పంపారు. 

వచ్చిన 104 మందిలో 79 మంది పురుషులు, 25 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 13 మంది పిల్లలు. వీరిలో ఎక్కువ మంది యుఎస్-మెక్సికో సరిహద్దు వద్ద పట్టుబడినట్లు తెలుస్తోంది. మిగతా వారినీ ఇండియాకు తిప్పి పంపేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది.