అతనో బిలియనీర్..అడ్డూ అదుపులోని ఖర్చు..విలాసవంతమైన జీవితం..పెద్దపెద్ద ఫ్యామిలీలో దోస్తీ..పార్టీలు,షికార్లు..ఉన్నదంతా మార్ట్ గేజ్ చేసి మరీ భార్య జల్సా లు.. మానేజ్ చేశాడు..కానీ ఎంతో కాలం మ్యానేజ్ చేయలేకపోయాడు..చివరి అతని ప్రాణాలకే ముప్పు తెస్తుందని గ్రహించలేకపోయాడు..చివరికి లెక్క లేసు కుంటే.. ఆస్తుల కన్నా ఆప్పులే కుప్పలుగా కనిపించాయి.. అవే అతన్ని బలితీసుకున్నాయి..
అమెరికాలో లోని న్యూయార్క్ కు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ బ్రాండన్ మిల్లర్ జూలైలో ఆత్మహత్య చేసుకున్నాడు.. అతడు చనిపోయిన రోజున అతని ఆస్తుల లెక్కలు, అప్పుల లెక్కుల చూస్తే దిమ్మతిరిగే విషయాలు బయటికొచ్చాయి.. మిల్లర్ చనిపోయేనాటికి అతని 34 మిలియన్ డాలర్ల అప్పుడు, కేవలం 8వేల డాలర్ల బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే ఉన్నాయి.
బ్రాండ్ మిల్లర్ అతని భార్య పీకల్లోతు అప్పుల్లో ఉన్నా.. ఎవరికీ తెలియకుండా సోషల్ మీడియాలో హైలెవెల్ ఫ్రొఫైల్ ను మెయింటెన్స్ చేయడంలో ఫేమస్ అయ్యా రు. బ్రాండన్ మిల్లర్ జూలై 3న మరణించేనాటికి అనుకున్నదానికంటే ఎక్కువ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నాడని అమెరికాకు చెందిన ది రియల్ డీల్ నివేదికలు హైలైట్ చేస్తున్నాయి.
ALSO READ | బైడెన్ సర్కార్‌పై జుకర్ బర్గ్ సంచలన ఆరోపణ
మిల్లర్, అతని భార్య పనికిరాని లైఫ్ స్టైల్ తో వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు.. వారి లైఫ్ స్టైల్ గురించి మామా+టాటా బ్లాగ్ లో షేర్ చేసేవారు.ఉన్నత స్థాయి కుటుంబానికి అదృష్ట అధిపతిగా చిత్రీకరించుకేనేవారు.. ఏదీ ఏమైనా కొత్త వాస్తవాలు ఆ కుటుంబం.. స్థాయిని మించి జీవించారు.. అది వారిని అప్పుల్లో కూరుకుపోయేలా చేసిందని స్థానిక ది న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.
మిల్లర్ జీవితం...జల్సా జీవితాలకు అలవాటుపడే వారికి ఓ పాఠం.. స్థాయికి మించి జీవనశైలి.. ఒళ్ళు మర్చి అప్పులు చేస్తే..మిల్లర్ లా తీవ్ర ఒత్తిడిలకు గురి కాక తప్ప దని హెచ్చరిస్తుంది. హై ఫ్రొఫైల్ జీవితం అనుభవించాలని అందరికి ఉంటుంది.. కానీ దానికి తగిన కృషి , సంపాదన, డబ్బు నియంత్రణ లేకుంటే పరిస్థితి మరోలా ఉంటుందనడానికి మిల్లర్ జీవితం ఒక ఉదాహరణ.