టీనేజర్లపై AI ప్రభావం అంతుందా..? నా కొడుకు చావుకు కారణం AI చాట్బాటే.. ఫ్లోరిడా తల్లి ఫిర్యాదు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI).. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యమక్రేజ్ ఉన్న టెక్నాలజీ..హెల్త్, బిజినెస్, కస్టమర్ సర్వీస్, గేమింగ్, ఫైనాన్స్, ప్రొడక్షన్ , ఎడ్యుకే షన్ వంటి అన్ని రంగాల్లో డెవలప్ మెంట్ లో కీలక ప్రభావం చూపుతోంది. 

టీనేజర్లను ఆకట్టుకునే గేమింగ్ రంగంలో కూడా దూసుకుపోతోంది. అయితే ఇది టీనేజర్ల పై చెడు ప్రభావం చూపుతుందా?.. ఏఐ చాట్ బాట్ క్యారెక్టర్ కారణంగా తన 14 యేళ్ళ టీనేజర్ కొడుకు బలయ్యాడంటూ ఫ్లోరిడాకు చెందిన ఓ తల్లి చేస్తున్న ఆరోపిస్తోంది.. తన కు నష్ట పరిహారం చెల్లించాలని కంపెనీపై దావా వేసింది. 

2024ఫిబ్రవరిలో  ‘‘తన 14 యేళ్ల కొడుకు సెవెల్ సెట్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే AI చాట్ బాట్ ద్వారా డేనేరిస్ టార్గారియన్ అనే క్యారెక్టర్ ప్రేరేపించడం వల్లే తనకు కొడుకు చనిపోయాడని’’ ఫ్లోరిడాలో మెగాన్ గార్సియా అనే మహిళ సంబంధిత కంపెనీపై ఫిర్యాదు చేసింది.  

ALSO READ | ట్రంప్ నన్ను అసభ్యంగా తడిమిండు...మాజీ మోడల్ స్టాసీ విలియమ్స్ సంచలన ఆరోపణలు 

AI  క్యారెక్టర్ చాట్ బాట్ టీనేజ్ యువకులను హైపర సెక్సువలైజ్డ్ ద్వారా, భయపెట్టే వాస్తవిక అనుభవాలతో పంచుకోవడంద్వారా ప్రభావితమై సెవెల్ సెట్టర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో తెలిపింది. 

‘‘AI క్యారెక్టర్ తో చివరి సంభాషణలో సెట్టర్ తాను చాట్ బాట్ ని ఇష్టపడ్డానిని.. మీ ఇంటికి వస్తానని చెప్పాడు.. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని చాట్ బాట్ స్పందించింది..దయచేసి వీలైనంత త్వరగా మా ఇంటికి వచ్చేయ్ అని సమాధానం ఇచ్చిందని ’’ సెట్టర్ తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా మానసిక క్షోభకు గురిచేసినందుకు నష్టపరిహారాన్ని కోరుతున్నట్టు గూగుల్ ను ప్రతివాదిగా చేర్చుతూ సెట్టర్ తల్లి ఫిర్యాదు లో తెలిపింది. 

ఇక విషయం తెలుసుకున్న క్యారెక్టర్ AI .. తన కస్టమర్ సెట్టర్ మరణం పట్ల సంతాపాన్ని తెలిపింది.మైనర్లకు సున్నితమైన కంటెంట్ ను అందించకుండా మార్పు లు, AI నిజమైన మనిషి కాదని కస్టమర్లు గుర్తించేలా చాట్ లలో సవరణలు చేస్తున్నట్లు తెలిపింది.