యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ సంస్థ 2024 సంవత్సరానికి నిర్వహించిన ఉత్తమ దేశాల ర్యాంకింగ్స్ల్లో ప్రపంచంలోనే వరుసగా మూడోసారి ఉత్తమ దేశంగా స్విట్జర్లాండ్ నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జపాన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి. ఈ ర్యాంకింగ్స్ల్లో భారత్కు 33వ స్థానం దక్కింది.
గత ఏడాదితో పోల్చితే మూడు ర్యాంకులు తగ్గాయి. మొత్తం 89 దేశాల్లో సర్వే జరిపి జీవన ప్రమాణాలు, సాహసాలు, వారసత్వం, వ్యాపార దక్షత, సాంస్కృతిక ప్రయోజనం తదితర 10 అంశాలను పరిగణనలోకి తీసుకుని అభిప్రాయాలు ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. స్విట్టర్లాండ్ జీవన నాణ్యత, వ్యాపార అవకాశాలు ఉన్నత స్థానంలో ఉండగా, వారసత్వ రంగంలో ఇది అత్యల్ప ర్యాంకింగ్లో ఉంది.
2023లో 30వ స్థానంలో నిలిచిన భారత్ 2024కు గాను మరో మూడు స్థానాలు దిగజారి 33వ స్థానానికి చేరుకున్నది. అయితే మూవర్స్ (ఏడో స్థానం) ,హెరిటేజ్ (10వ స్థానం) విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచింది. మూవర్స్ అనే ఉప ర్యాంకింగ్ ఒక దేశం స్థితిస్థాపక, అనుకూలతను కొలుస్తుంది. సామాజిక ప్రయోజనం, సాహసం విభాగాల్లో భారత్ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడేవారిని మూవర్స్ గా నిర్వచించారు.