గల్ఫ్ ఆఫ్ మెక్సికో కాదు.. ఇక నుంచి గల్ఫ్ ఆఫ్ అమెరికా

గల్ఫ్ ఆఫ్ మెక్సికో కాదు.. ఇక నుంచి గల్ఫ్ ఆఫ్ అమెరికా

వాషింగ్టన్: గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ‘గల్ఫ్ ఆఫ్​అమెరికా’గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ పేరు మార్చారు. ఫిబ్రవరి 9వ తేదీని ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా డే’ గా ప్రకటిం చారు. ఈమేరకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్​పై సంతకం చేశారు. 

అమెరికా గొప్పతనాన్ని గౌరవించేలా పేర్లను పునరుద్ధరిస్తున్నామని ఆ ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు. మార్చాల్సిన పేర్లను 30 రోజుల్లోపు ఖరారు చేయాలని అంతర్గత వ్యవహారాల మంత్రిని ఆదేశించారు. 

‘‘గల్ఫ్  ఆఫ్  మెక్సికో చాలాకాలంగా అమెరికాలో అంతర్భాగంగా ఉంది. ఈ విషయంలో నా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ సందర్భంగా గల్ఫ్​ ఆఫ్  మెక్సికోను గల్ఫ్  ఆఫ్​ అమెరికాగా మార్చాం” అని ట్రంప్ పేర్కొన్నారు.