రిలయన్స్ చమురు దిగుమతులకు అమెరికా ఓకే

రిలయన్స్ చమురు దిగుమతులకు అమెరికా ఓకే

న్యూఢిల్లీ: రిలయన్స్  వెనిజులా నుంచి చమురు దిగుమతిని తిరిగి ప్రారంభించడానికి యూఎస్​ గ్రీన్​సిగ్నల్​ ఇచ్చిందని సమాచారం. వెనెజులా నుంచి చమురు కొనుగోలుకు ఆంక్షలు ఉన్నప్పటికీ అనుమతి మంజూరు చేసింది. మనదేశంలో  అతిపెద్ద ప్రైవేట్ రిఫైనర్ అయిన రిలయన్స్​ వెనిజులా క్రూడ్ కొనుగోలును త్వరలో ప్రారంభించాలని యోచిస్తోంది.   ఈ ఏడాది  ఏప్రిల్‌లో అమెరికా వెనుజులాపై ఆంక్షలను మళ్లీ విధించింది.  నిష్పక్షపాత ఎన్నికల హామీని అధ్యక్షుడు మదురో నిలబెట్టుకోకపోవడమే ఇందుకు కారణం.