
న్యూయార్క్: టైటిల్ ఫేవరెట్లు నొవాక్ జొకోవిచ్, కార్లోస్ అల్కరాజ్‌నిరాశ పరిచిన యూఎస్‌ఓపెన్‌లో టాప్ సీడ్, వరల్డ్ నంబర్ వన్ జానిక్ సినర్‌జోరు కొనసాగిస్తున్నాడు. మూడో రౌండ్‌ను ఈజీగా దాటిన సినర్ ప్రిక్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు. అతనితో పాటు సీడెడ్ ప్లేయర్లు డానిల్ మెద్వెదెవ్, డి మినార్‌కూడా నాలుగో రౌండ్ చేరారు. శనివారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో సినర్ (ఇటలీ) 6–1, 6–4, 6–2తో క్రిస్టోఫర్ ఒ కానెల్ (ఆస్ట్రేలియా)ను చిత్తు చేశాడు. ఈ మ్యాచ్‌లో 15 ఏస్‌లు కొట్టిన సినర్.. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. 46 విన్నర్లతో ఆకట్టుకున్నాడు.
ఇతర మ్యాచ్‌ల్లో ఐదో సీడ్‌మెద్వెదెవ్ (రష్యా) కూడా 6–3, 6–4, 6–3తో వరుస సెట్లలో 31వ సీడ్ ప్లావియో కొబొలి (ఇటలీ)ని ఓడించగా.. పదో సీడ్ డిమినార్ (ఆస్ట్రేలియా) 6–3, 6–7 (4/7), 6–0, 6–0తో బ్రిటన్ ప్లేయర్ ఎవాన్స్‌కు చెక్ పెట్టాడు. 14వ సీడ్ టామీ పాల్‌కూడా ముందంజ వేశాడు. విమెన్స్ సింగిల్స్‌లో టాప్ సీడ్ ఇగా స్వైటెక్, ఐదో సీడ్ జాస్మిన్ పౌలిని, ఆరో సీడ్ జెస్సికా పెగులా నాలుగో రౌండ్‌చేరారు.
పోలాండ్ స్టార్ స్వైటెక్ 6–4, 6–2తో 25వ సీడ్ పవ్లుచెంకోవా (ఉక్రెయిన్)పై వరుస సెట్లలో గెలిచింది. పౌలిని (ఇటలీ) 6–3, 6–4తో పుతిన్త్సెవా (కజకిస్తాన్)ను, పెగులా 6–3, 6–3తో బోజాస్ (స్పెయిన్)ను చిత్తు చేశారు. 22వ సీడ్ హడాడ్ మైయా (బ్రెజిల్) 6–3, 6–1తో 15వ సీడ్ అనా కలిన్‌స్కయా (రష్యా)ను ఓడించింది. డెన్మార్క్ వెటరన్ స్టార్ కరోలిన్ వోజ్నియాకి 6–3, 6–2తో జెస్సికా పాంచెట్ (ఫ్రాన్స్)పై గెలిచింది.
మిక్స్డ్క్వార్టర్స్లో బోపన్న జోడీ
మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇండియా స్టార్ రోహన్ బోపన్న– అల్డియా సుడ్జాది (ఇండోనేసియా) జంట క్వార్టర్స్‌చేరింది. ప్రిక్వార్టర్స్‌లో 8వ సీడ్ బోపన్న–అల్డియా జోడీ 0–6, 7–6 (7/5), 10–7తో జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా)–సినియకోవా (చెక్‌రిపబ్లిక్) ద్వయంపై ఉత్కంఠ విజయం సాధించింది. ఒక్క గేమ్ కూడా నెగ్గకుండా తొలి సెట్ కోల్పోయిన ఇండో–ఇండోనేసియా జోడీ తర్వాత అద్భుతంగా పుంజుకుంది.