హైదరాబాద్లో ఫార్మా కంపెనీ Eli Lilly జీసీసీ..వెయ్యి మందికి ఉద్యోగాలు

న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ ఎలీ లిలీ హైదరాబాద్​లో గ్లోబల్​ కేపబిలిటీ సెంటర్​ (జీసీసీ)ని ప్రారంభిస్తామని ప్రకటించింది. దీనికోసం వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు ఇస్తామని తెలిపింది. 

జీసీసీ ద్వారా కంపెనీ ఆటోమేషన్​, ఏఐ, సాఫ్ట్​వేర్​ప్రొడక్ట్​ ఇంజనీరింగ్​, క్లౌడ్​కంప్యూటింగ్​ సామర్థ్యాలను పెంచుకోనుంది. 

ప్రస్తుతం టెక్నాలజీ ఇంజనీర్లను, డేటా సైంటిస్టులను నియమించుకుంటోంది. ఎలీ లిలీ 2016లో బెంగళూరులో జీసీసీని ప్రారంభించింది. ఈ విషయమై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి డి.శ్రీధర్​బాబు మాట్లాడుతూ హైదరాబాద్​హెల్త్​కేర్​హబ్​గా ఎదుగుతున్నదనడానికి ఎలీ లిలీ పెట్టుబడులు నిదర్శనమని చెప్పారు.