Jaahnavi Kandula: భారత విద్యార్థిని చంపిన అమెరికా పోలీస్ ఉద్యోగం పీకేశారు

Jaahnavi Kandula: భారత విద్యార్థిని చంపిన అమెరికా పోలీస్ ఉద్యోగం పీకేశారు

దాదాపు రెండేళ్ల క్రితం.. 2023 జనవరిలో అమెరికాలోని సియాటిల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఓ పోలీస్ అధికారి అతివేగంతో వాహనాన్ని నడిపి.. ఆమె ప్రాణాలు హరించాడు. ఏకంగా సుమారు గంటకు 119 కిలోమీట‌ర్ల వేగంతో పెట్రోలింగ్ వాహనంతో ఆమెను ఢీకొట్టాడు. వాహనం ఢీకొన్న వేగానికి ఆమె దాదాపు 100 దూరంలో ప‌డిపోయింది. 

ఈ ఘటనలో రెండేళ్ల తరువాత తీర్పొచ్చింది. ప్రమాదానికి కారణమైన పోలీసు ఆఫీస‌ర్ కెవిన్ డేవ్‌ను విధుల నుంచి తొల‌గించి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారు. ప్రమాదంలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని చెప్తూనే.. జరిగిన ఘటన ఉద్దేశపూర్వక చర్య కాదని పోలీసు శాఖ పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మరొకరికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో అతను వేగంగా వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

ALSO READ | కెనడా తర్వాత పీఎంగా..ఇండియన్ ఆరిజన్ అనితా ఆనంద్! ఎవరీమె..ఫుల్ డిటెయిల్స్

ప్రమాదానికి బాధ్యుడైన సదరు పోలీస్ అధికారి డేవ్.. డ్రగ్ ఓవ‌ర్‌డోసు బాధిత వ్యక్తిని కాపాడేందుకు వేగంగా వెళ్తున్న సమయంలో రోడ్డు క్రాస్ చేస్తున్న జాహ్నవిని ఢీకొట్టాడు. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదానికి, దాని ప‌ర్యవ‌సానాల‌ను ఆమోదించ‌లేమ‌ని సియాటిల్‌ తాత్కాలిక పోలీసు చీఫ్ రహర్ అన్నారు. అలా అని మంచి ఉద్దేశంతో వేగంగా వెళ్తున్నా.. అత‌ని నిర్లక్ష్యానికి వ‌ల్ల ఓ ప్రాణం బ‌లైంద‌న్నారు. ఈ ఘటనతో సియాటిల్ పోలీసు శాఖ‌కు చెడ్డ పేరు వ‌చ్చింద‌న్నారు. జాహ్నవి మృతి ప‌ట్ల న‌వ్వుతూ వ్యాఖ్యలు చేసిన మ‌రో పోలీసు డేనియ‌ల్ ఆడెర‌ర్‌ను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు.