
- అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అఫ్గానిస్తాన్‌కు మళ్లీ తమ సైన్యాలను పంపించే ఆలోచన చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అఫ్గాన్ నుంచి బైడెన్ సైన్యాన్ని వెనక్కి తీసుకోగా.. తిరిగి పంపించాలని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కేబినెట్ సమావేశం తర్వాత ట్రంప్ విలేకరులతో మాట్లాడారు.
‘‘అఫ్గాన్ కు బిలియన్ల కొద్దీ డాలర్లు ఇచ్చాం. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే సైన్యాన్ని వెనక్కి రప్పించడం మొదలుపెట్టాం. కానీ, మేం బాగ్రామ్ ఎయిర్ బేస్‌ను ఉంచుకునేవాళ్లం. చైనా వల్ల మేం తిరిగి ఆర్మీని పంపించబోతున్నాం. ఎందుకంటే ఈ ఎయిర్ బేస్ నుంచి గంట దూరంలోనే చైనా అణ్వాయుధాల తయారీ కేంద్రం ఉంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు.