
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు మూడు రోజుల ప్రమాణ స్వీకార సెలబ్రేషన్స్ వాషింగ్టన్ డీసీ లో ప్రారంభమయ్యాయి. ఈ సెలబ్రేషన్స్ లో ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామికవేత్తలు, ప్రపంచ వ్యాపార ప్రముఖులు, ట్రంప్ మంత్రివర్గంలోని నామినేటెడ్ సభ్యులు పాల్గొన్నారు.
PHOTO | Washington, DC: US President-elect Donald Trump met Nita Ambani and Mukesh Ambani before his swearing-in ceremony.
— Press Trust of India (@PTI_News) January 19, 2025
(Source: Third Party) pic.twitter.com/uBuwNt4ebx
Also Read : అమెరికాలో టిక్ టాక్ బ్యాన్..
ఈ సంబరాల్లో ఇండియన్ బిలియనీర్, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ, నీతాఅంబానీల జంట హాజరయ్యారు. ఓత్ సెర్మనీకి ముందు ఏర్పాటు డొనాల్డ్ ట్రంప్ చేసిన విందులో పాల్గొన్నారు. ముకేష్ అంబానీ, నీతా అంబానీలు ట్రంప్ ను కలిసి అభినందనలు తెలిపారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా సోమవారం వాషింగ్టన్ డీసీలో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.