ఉక్రెయిన్ కు అత్యాధునిక రాకెట్లను ఇస్తం

ఉక్రెయిన్ కు  అత్యాధునిక రాకెట్లను ఇస్తం

అత్యాధునిక రాకెట్ వ్యవస్థలను ఉక్రెయిన్ కు ఇచ్చేందుకు అంగీకరించారు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్. రష్యా టార్గెట్లు ఛేదించేందుకు ఉక్రెయిన్ కు లాంగ్ రేంజ్ అడ్వాన్స్ డ్ రాకెట్ సిస్టమ్స్ ఇస్తున్నట్లు తెలిపారు బైడెన్. సుమారు 700 మిలియన్ల డాలర్ల ఖరీదైన ఆయుధ ప్యాకేజీకి అమెరికా ఓకే చెప్పింది. ఇందులో భాగంగానే అడ్వాన్స్ డ్ రాకెట్లు ఇవ్వనుంది. సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను ఈ రాకెట్లు కచ్చితత్వంతో ఛేదించగలవు. అయితే రష్యాపై దాడులు జరిపేందుకు మిసైళ్లు వాడమని ఉక్రెయిన్ హామీ ఇవ్వడంతో అమెరికా ఈ ప్రకటన చేసింది. న్యూయార్క్ టైమ్రస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉక్రెయిన్ పై రష్యా ఆక్రమణ అంశం దౌత్యంతో పరిష్కారం అవుతుందని, కానీ ఉక్రెయిన్ కు అత్యాధునిక ఆయుధాలు ఇవ్వాల్సిన అవసరముందన్నారు బైడెన్.