ఆఫ్ఘన్ దాడులపై బైడెన్ కీలక నిర్ణయం

ఆఫ్ఘన్ దాడులపై బైడెన్ కీలక నిర్ణయం

ఆఫ్గనిస్తాన్ లోని ప్రస్తుత పరిస్థితులకు అమెరికానే కారణమని వెల్లువెత్తుతున్న విమర్శలపై అధ్యక్షుడు జో బైడెన్ ఫస్ట్ టైమ్ స్పందించారు. తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. ఆఫ్గన్ నుంచి బలగాల ఉపసంహరణకు సరైన టైమ్ అంటూ ఏదీ లేదని 20 ఏళ్ల తర్వాత తమకు తెలిసి వచ్చిందన్నారు. అమెరికా గత అధ్యక్షులు చేసిన తప్పు తాను చేయనని ఆయన అన్నారు. ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ బాధ్యతను మరో అధ్యక్షడికి ఇవ్వబోనన్నారు. అయినా ఆఫ్గన్ లో తమ మిషన్... అక్కడి జాతి నిర్మాణం కోసం కాదని తేల్చి చెప్పారు. రిస్క్ గురించి తమకు పూర్తి అవగాహన ఉందని... అయితే అంచనా వేసినదాని కంటే... వేగంగా తాలిబాన్లు ఆక్రమించారని చెప్పారు. తమ బలగాలు, సిబ్బందిపై దాడి చేసినా, తమ ఆపరేషన్స్ ని డిస్టర్బ్ చేసినా... కఠినంగా చర్యలు చేపడతామని హెచ్చరించారు.