![ట్రంప్ మరో కీలక నిర్ణయం.. 10 వేల మందిలో 9,700 మంది ఉద్యోగులు ఔట్..!](https://static.v6velugu.com/uploads/2025/02/us-president-trump-administration-to-fire-over-9700-usaid-staff-amid-row-report_hQie8yoRUE.jpg)
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 9,700 మంది యూఎస్ ఎయిడ్ స్టాఫ్ను ఉద్యోగాల నుంచి తొలగించాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ ఎయిడ్ స్టాఫ్10 వేల మందికి పైగానే ఉన్నారు. ట్రంప్ ఉన్నపళంగా 9700 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాలని డిసైడ్ కావడం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయింది.
కేవలం 300 మంది ఉద్యోగాలు మాత్రమే.. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే.. 294 మంది ఉద్యోగులు మాత్రమే యూఎస్ ఎయిడ్ స్టాఫ్గా ఇకపై కొనసాగనున్నారు. ఇందులో 12 మంది ఆఫ్రికన్ బ్యూరో, 8 మంది ఆసియా బ్యూరో ఉద్యోగులు కూడా ఉన్నారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆరేళ్లుగా యూఎస్ ఎయిడ్ ఏజెన్సీకి హెడ్గా పనిచేస్తున్న జె.బ్రియాన్ ఎట్వుడ్ స్పందించారు.
ఇంతమందిని ఒకేసారి తొలగించడం అంటే.. ఈ ఏజెన్సీని చంపేయడమేనని.. మిలియన్ల కొద్దీ ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏజెన్సీని నామరూపాలు లేకుండా చేస్తే లక్షల మంది సాయం అందక మనుగడ కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
యూఎస్ ఎయిడ్ స్టాఫ్పై ట్రంప్కు అత్యంత సన్నిహితుడు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ‘ఎక్స్’ యజమాని మస్క్ నేరారోపణలు చేసిన సంగతి తెలిసిందే. యూఎస్ ఎయిడ్ ఏజెన్సీలో ఉన్న ఉద్యోగులంతా క్రిమినల్స్ అని, ఈ ఏజెన్సీ ఉద్యోగుల్లో చాలామంది లీవ్లో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా లైఫ్ సేవింగ్ ప్రోగ్రామ్స్ నిలిచిపోయాయని మస్క్ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.