
Donald Trump: గడచిన కొన్నాళ్లుగా టారిఫ్స్ విధించనున్నట్లు ప్రపంచ దేశాలను హెచ్చరిస్తూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరికి తన మాట నిలబెట్టుకున్నాడు. చిరకాల మిత్రుడు ఇండియాపై సుంకాలు విధించబోడని అందరూ భావించినప్పటికీ.. కొంత డిస్కౌంట్ ఇస్తూ 26 శాతం పన్నులను భారతీయ ఉత్పత్తులపై విధించారు. ఇదే క్రమంలో చైనాతో పాటు దాదాపు 50 దేశాలపై ట్రంప్ టారిఫ్స్ ప్రకటించారు. ఇందులో అత్యధికంగా కంబోడియాపై 49 శాతం విధించగా అత్యల్పంగా 10 శాతం చొప్పున సుంకాల పెంపును వివిధ దేశాలపై ట్రంప్ ఫిక్స్ చేశారు.
వాస్తవానికి దేశాలు దిగుమతులు లేదా ఎగుమతులను కంట్రోల్ చేసేందుకు వివిధ ఉత్పత్తులపై ఎప్పటికప్పుడు టారిఫ్స్ ప్రకటిస్తుంటాయి. దీనిద్వారా దేశీయ పరిశ్రమలకు మేలు చేకూర్చటమే దాని ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ప్రస్తుతం ట్రంప్ తన టారిఫ్స్ ప్రకటనలో కొన్ని కీలకమైన వస్తువులు లేదా ఉత్పత్తులను సుంకాల పరిధి నుంచి మినహాయింపును కూడా ప్రకటించారు. రాగి, మందులు, సెమీకండక్టర్లు, చెక్క వస్తువులు, ఎనర్జీ ఉత్పత్తులు వంటివి ఇందులో ఉన్నాయి.
ప్రపంచ దేశాలపై ట్రంప్ ఏఏ వస్తువులను తన టారిఫ్స్ రాడార్ కిందకు రాకుండా మినహాయింపులను అందించారో ఇప్పుడు తెలుసుకుందాం..
1. బంగారం
2. వెండి
3. ఇన్సులిన్, దాని సాల్ట్స్
4. విటమిన్- ఏ
5. విటమిన్- బి1
6. విటమిన్- బి2
7. విటమిన్- బి5
8. విటమన్- బి6
9. విటమిన్- బి12
10. విటమిన్- సి
11. విటమిన్- ఈ
12. ఫోలిక్ యాసిడ్
13. నియాసిన్, నియాసినమైడ్
14. టాన్‌సిస్టర్లు1వాట్ కింద లేదా దానికంటే పెద్దవి
15. పేపర్ బోట్, బ్రోచర్స్, లీఫ్ లెటర్స్, జర్నల్స్, పిరియాడికల్స్ ఇతర పేపర్ ఉత్పత్తులు
16. కలరింగ్ బుక్స్, డ్రాయింగ్స్
17. మ్యూజిక్ ప్రింటెడ్ లేదా మాన్యూస్క్రిప్ట్
18. మ్యాప్స్ అండ్ హైడ్రోగ్రాఫిక్స్
19. గ్లోబ్స్, ప్రింటెడ్ మ్యాప్స్, ప్రింటెడ్ అడ్వర్టైజింగ్ మెటీరియల్స్
20. జింక్, జింక్ అలాయ్, జింక్ వేస్ట్ అండ్ స్కాప్
21. సెమీకండక్టర్లు, ఫొటోసింథటిక్ సెమీకండక్టర్లు
22. ట్రాన్సిస్టర్ పార్ట్స్, మౌండెట్ పిజోఎలక్ట్రిక్ క్రిస్టల్స్
23. కాయిన్స్
24. ప్రాటినం, రోడియం
25.ప్రాథమిక రంగులు, వాటి ఆధారంగా తయారుచేసినవి