సెంట్రల్ బ్యాంక్ తీసుకురావాలని అనుకున్న డిజిటల్ డాలర్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిషేధం విధించారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ఆయన గురువారం సంతకం చేశారు. బైడెన్ సర్కార్ హయాంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) తీసుకురావాలని నిర్ణయించారు. అయితే అది అమెరికాకు ప్రమాదమని ట్రంప్ పేర్కొన్నారు. డిజిటల్ డాలర్ సృష్టి, జారీ, వినియోగంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సెంట్రల్ బ్యాంక్ తీసుకురావాలనుకున్న డిజిటల్ కరెన్సీ (CBDC) సృష్టి, జారీని నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో,పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత CBDCని నిషేధించడం తన ఎజెండాలలో ఒకటి అని ట్రంప్ చెప్పాడు. బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీకి సంబంధించి ట్రంప్ తన రెండో పదవీ కాలంలో చేసిన మొదటి పెద్ద ఎత్తుగడ ఇది.