మేకిన్​ యూఎస్​.. మీ ప్రొడక్టులను అమెరికాలో తయారు చేయండి: ట్రంప్

 మేకిన్​ యూఎస్​.. మీ ప్రొడక్టులను అమెరికాలో తయారు చేయండి: ట్రంప్
  • లేకుంటే ఎక్కువ టారిఫ్​లు కట్టండి
  • సౌదీ అరేబియా చమురు ధరలు తగ్గించాలి 
  • దావోస్ సదస్సులో వర్చువల్​గా యూఎస్  ప్రెసిడెంట్ స్పీచ్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వ్యాపారవేత్తలంతా తమ ప్రొడక్టులను అమెరికాలోనే ఉత్పత్తి చేయాలని తెలిపారు. లేకుంటే అధిక టారిఫ్ లు కట్టాల్సి ఉంటుందన్నారు. గురువారం దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొన్న వ్యాపారవేత్తలను ఉద్దేశించి ట్రంప్ వర్చువల్ గా మాట్లాడారు. ప్రపంచంలోని ప్రతి వ్యాపారవేత్తకు నేనొక విషయం చెప్పదలుచుకున్న. 

మీ ప్రొడక్టులను అమెరికాలోనే తయారు చేసుకోండి. అప్పుడే మీపై తక్కువ ట్యాక్స్ అమలు చేసేందుకు వీలుంటుంది. వస్తువులను ఎక్కడ తయారు చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ కంపెనీలకు ఉంది. కానీ యూఎస్ లో ఉత్పత్తి నిలిపేస్తే మీరు ఇబ్బందులు పడతారు. టారిఫ్ ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది" అని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే..చమురు ధరలను తగ్గించాలని సౌదీ అరేబియాను ట్రంప్ కోరారు. అమెరికాలో పెట్టుబడిని ఒక ట్రిలియన్ డాలర్లకు పెంచాలని సూచించారు.  

మా వాళ్లంతా దేశభక్తులే.. 

అమెరికా అధ్యక్షుడిగా ఇప్పటికే నాలుగేండ్ల పాటు ప్రజా సేవ చేశానని, ఆ టర్మ్​లో తాను ఏ తప్పూ చేయలేదని  ట్రంప్ అన్నారు.  తన ఫ్యామిలీతో పాటు రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులంతా దేశభక్తులే అని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘‘జో బైడెన్ అధ్యక్షుడిగా దిగిపోయే ముందు.. తనకున్న అన్ని అధికారాలను ఉపయోగించుకుని క్షమాభిక్ష ప్రసాదించుకున్నారు. 

Also Read :- తెలంగాణలో అగ్రశ్రేణి కంపెనీల విస్తరణ సీఎం సమక్షంలో ఒప్పందాలు

తన ఫ్యామిలీతో పాటు కొంత మంది అధికారులు, కావాల్సిన వాళ్లకి కూడా క్షమాభిక్ష పెట్టారు. ఇది దురదృష్టకరం. గతంలో నేను అధ్యక్షుడిగా దిగిపోయేటప్పుడు.. క్షమాభిక్ష పెట్టుకునే అవకాశం ఉన్నా.. ఏ తప్పూ చేయనప్పుడు క్షమాభిక్ష ఎందుకని వద్దనుకున్నా. కానీ క్యాపిటల్ భవనంపై దాడి కేసులో.. అమాయకులు ఉన్నారు. వాళ్లంతా దేశభక్తులు. అందుకే ఆ దాడి ఘటనలో పాల్గొన్న 1,500 మందికి క్షమాభిక్ష ప్రసాదించాను” అని తెలిపారు. 

ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ బిల్లుకు ఆమోదం

ట్రంప్ సర్కారు తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్‌ డిటెన్షన్‌ బిల్లు అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం పొందింది. దీంతో అక్రమ వలసదారులపై చర్యలకు లైన్‌ క్లియర్‌ అయినట్లయ్యింది. అలాగే, రెండో దఫా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక ట్రంప్ సంతకంతో చట్టం రూపం దాల్చిన తొలి బిల్లు కూడా ఇదే అయ్యింది. లేకెన్‌ రిలే యాక్ట్‌ పేరుతో ఈ బిల్లు తీసుకొచ్చారు. ఇక నుంచి అమెరికాలో ఏ చిన్న నేరం చేసినా.. దాన్ని తీవ్రంగా పరిగణించి స్వదేశానికి పంపించేస్తారు

ఉష మతం గురించి తెగవెతికిన నెటిజన్లు  

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్  భార్య ఉషా వాన్స్ మతంపై నెటిజన్లు గూగుల్ లో ఎంతో ఆసక్తిగా వెతికారు. ఆమెది హిందూ మతమా, క్రైస్తవ మతమా? ఆమె ఏ మత ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తారు? అంటూ నెటిజన్లు ఆరా తీశారు. వాస్తవానికి ఉషది హిందూ కుటుంబం. 1980లో ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వలసవెళ్లారు. 

శాన్ డియాగోలో ఉష జన్మించారు. ఆమె తండ్రి ఐఐటీ మద్రాస్ లో గ్రాడ్యుయేషన్  పూర్తిచేయగా.. తల్లి మాలిక్యూలర్  బయోలజిస్టుగా పనిచేశారు. ఇక, యేల్  వర్సిటీలో ఉష లా పూర్తిచేశారు. అక్కడే 2010లో జేడీ వాన్స్ ను ఉష కలిశారు. కొద్ది రోజుల తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. 2014లో వారు పెండ్లి చేసుకున్నారు. క్రిస్టియన్ ను పెళ్లి చేసుకున్నా.. ఉష ఇప్పటికీ హిందూ ఆచారాలనే పాటిస్తారు.