వాషింగ్టన్: రష్యాతో జరుగుతున్న యుద్ధం ఆగేలా చూస్తానని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీకి అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. తాను అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక రెండు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలుకుతానని చెప్పారు. శుక్రవారం ట్రంప్‌కు జెలెన్ స్కీ ఫోన్ చేశారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
‘‘నాకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అందుకు ఆయనను అభినందిస్తున్నాను. అమెరికాకు తదుపరి అధ్యక్షుడిగా ప్రపంచ శాంతికి కృషి చేస్తా. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతా. చర్చల ద్వారా శాంతి నెలకొల్పుతా” అని ట్రంప్ చెప్పారు.