అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలని జో బైడెన్ ను బహిరంగంగానే చెబుతున్నారు డెమోక్రాట్లు..బైడెన్ అభ్యర్థిత్వంపై సందేహాలు వ్యక్తం చేస్తూ ..ఆయన స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. మొదటి యూఎస్ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత డెమోక్రాట్లతో చాలామంది బైడెన్ స్థానంలో మరొకరిని పెట్టాలని కోరుకున్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా.. బైడెన్ పోటీనుంచి తప్పుకుంటే మంచిదని సూచించారు. మిత్రదేశాలకు సిఫారసు కూడా చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో బైడెన్ తర్వాత డెమోక్రాట్ల అభ్యర్థి ఎవరు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బైడెన్ ఆరోగ్య పరిస్థితి, అభ్యర్థిత్వంపై సందేహాలు మొదలైనప్పటినుంచి .. ఆయన పోటీ నుంచి తప్పుకుంటే నెక్ట్స్ ఎవరు అని చర్చలు మొదలయ్యాయి. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హరీస్ పేరు మొదట తెరపైకి వచ్చింది. అయితే రాను రాను కమలా హరీస్ తో పాటు డెమోక్రాట్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాలోని ఓ అనలిటిక్స్ కంపెనీ సర్వే నిర్వహించింది. ఈ సర్వేల్లో డెమోక్రాట్ల తరపును అమెరికా అధ్యక్ష రేసులో ప్రముఖంగా నలుగురు పేర్లు వినిపించాయి.
బైడెన్ తర్వాత.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఉంటే డెమోక్రాట్ల అభ్యర్థి ఎవరు అని అనలిటిక్స్ కంపెనీ బ్లూ ల్యాబ్ సర్వే నిర్వహించింది. ఏడు రాష్ట్రాల్లో జూలై 5 నుంచి 12 వరకు నిర్వహించిన సర్వేలో బైడెన్ తో సహా 11 మంది పేర్లు వినిపించాయి. ఇందులో ఇండియన్ సంతతి కి చెందిన కమలా హారీస్ పేరు కూడా ఉంది.
బైడెన్ తర్వాత అమెరికా అధ్యక్ష పోటీలో ఉన్న డెమోక్రాట్లలో నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపించాయని సర్వే సూచించింది. పార్టీ వర్చువల్ రోల్ కాల్, బైడెన్ స్థానంలో మరొక అభ్యర్థిని నియమించాలని భావిస్తున్న క్రమంలో ఈ సర్వే ఫలితాలు కీలకంగా మారాయి.
బైడెన్ స్థానంలో ప్రస్తుత యూఎస్ కాంగ్రెస్ తో పాటు రాష్ట్రాలలో కీలక పదవుల్లో ఉన్నవారి పేర్లు వెలుగులోకి వచ్చాయి. కనీసం 5 పాయింట్లతో బైడెన్ కంటే ముందున్నారు వీళ్లంతా..అరిజోనా రాష్ట్రానికి చెందిన యూఎస్ సెనెటర్ మార్క్ కెల్లీ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత మేరీ ల్యాండ్ గవర్నర్ వెస్ మూర్, పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ సాపిరో, మిచిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్కర్ ఉన్నారు. సర్వేల ప్రకారం.. కమలా హారీష్ రేసులో ఉన్నప్పటికీ ఈ నలుగురికంటే వెనకబడి ఉన్నారు.
బైడెన్ తర్వాత అమెరికా అధ్యక్ష పోటీలో డెమోక్రాట్ల అభ్యర్థిగా మార్క్ ఎడ్వర్డ్ కెల్లీ ప్రముఖంగా వినిపిస్తోంది. కెల్లీ అమెరికన్ వ్యాపార వేత్త.. మాజీ వ్యోమగామి.. యూనైటెడ్ నేవీ కెప్టెన్ కూడా.. కెల్లీ 2020 నుంచి అరిజోనా నుంచి జూనియర్ యూనైటెడ్ స్టేట్స్ సెనెటర్ గా కొనసాగుతున్నారు. కీలక డెమోక్రాటిక్ అభ్యర్థి. సర్వేల్లో అమెరికా ప్రజలు కమలా హారిస్ కు కూడా ప్రముఖ స్థానాన్ని కల్పించారు. అయితే ఆమె ఇతర పార్టీ సభ్యులతో పోలిస్తే మెరుగైన పనితీరు కనబరచలేదనే సందేహాన్ని వ్యక్తం చేశారు.