అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏడు స్వింగ్ రాష్ట్రాలు ఎంతో కీలకం. ఈ రాష్ట్రాల ఫలితాలు అమెరికా అధ్యక్షుడి ఎన్నికలో క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. స్వింగ్ రాష్ట్రాల్లో మెజార్టీ సాధించిన అభ్యర్థులు దాదాపు అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది.
ఏడు రాష్ట్రాల్లో అరిజోనా స్టేట్ ఒకటి. ఇక్కడ మొత్తం 11 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఇమ్మిగ్రేషన్ అంశం ఎంతో కీలకం. 2020 ఎన్నికల్లో బైడెన్ గెలిచారు.
రెండో స్టేట్ జార్జియా.. ఇక్కడ మొత్తం 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. 2020 ఎన్నికల్లో ట్రంప్ జోక్యం చేసుకున్నారంటూ జార్జియాలోని అడ్వొకేట్లు ఆయనపై కేసు పెట్టారు. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడలేదు.
మిషిగాన్ స్టేట్‌లో మొత్తం 15 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ఆటో పరిశ్రమలు ఎక్కువ. అరబ్ అమెరికన్లే ఎక్కువగా ఉంటారు.
నెవడా స్టేట్‌లో 6 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. కాలిఫోర్నియా, డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా తర్వాత అత్యధిక నిరుద్యోగ రేటు నెవడాలోనే ఉంది.
నార్త్ కరోలినా స్టేట్‌లో మొత్తం 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. స్వింగ్ స్టేట్ జాబితాలో ఈ రాష్ట్రం చేరింది. జులైలో బైడెన్ ఆధిక్యాన్ని కనబర్చారు. ఆయన తప్పుకున్నాక ట్రంప్‌కు మద్దతుదారులు పెరిగారు. 60% నల్లజాతీయులు ఉన్నారు.
పెన్సిల్వేనియా స్టేట్‌లో మొత్తం 19 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలోనే ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. హారిస్, ట్రంప్ మధ్య జరిగిన ఏకైక డిబేట్ సెప్టెంబర్10న ఇక్కడే నిర్వహించారు.
విస్కాన్సిన్ స్టేట్‌లో మొత్తం 10 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. గత రెండు అధ్యక్ష ఎన్నికల్లో ఇక్కడే అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. 2020 ఎన్నికల్లో బైడెన్‌కు దాదాపు 21వేల ఓట్లు వచ్చాయి. 2016, 2020 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థులకు 20వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారు.