- తులసీ గబ్బార్డ్ సాయంతో ప్రాక్టీస్ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్ డీసీ: డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌ను వచ్చే నెలలో జరగనున్న డిబేట్లో ఎదుర్కోవడానికి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించారు. ఫ్లోరిడాలోని తన ప్రైవేట్ రిసార్ట్ ‘మార్ ఏ లాగో’లో ట్రంప్ ప్రాక్టీస్ చేస్తున్నారని, ఇందుకోసం డెమోక్రటిక్ పార్టీ మాజీ నేత, ఇండియన్ అమెరికన్ లీడర్ తులసీ గబ్బార్డ్ సాయం తీసుకుంటున్నారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.
ట్రంప్, హారిస్ మధ్య సెప్టెంబర్ 10న ఏబీసీ న్యూస్ చానెల్ డిబేట్ నిర్వహించనుంది. జూన్ 27న సీఎన్ఎన్ ఆధ్వర్యంలో జరిగిన డిబేట్లో అప్పటి డెమోక్రటిక్ అభ్యర్థి బైడెన్‌పై ట్రంప్ పూర్తిస్థాయిలో ఆధిపత్యం చూపారు. కానీ బైడెన్ కన్నా కమలా హారిస్ దూకుడుగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ఆమెను ఎదుర్కొనేందుకు తులసీతో కలిసి వ్యూహాలు రచిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.