
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ కంపెనీలు అమెజాన్, వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లకు 125 బిలియన్ డాలర్ల విలువైన ఈ–-కామర్స్ మార్కెట్‌కు పూర్తి యాక్సెస్ ఇవ్వాలని అమెరికా భారతదేశంపై ఒత్తిడి తెస్తోందని తెలుస్తోంది. వాణిజ్య ఒప్పందం కోసం రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది. ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, ఈ–కామర్స్ మార్కెట్‌లో తమ కంపెనీలకు అన్ని రకాల పర్మిషన్లను, సమాన అవకాశాలను ఇవ్వాలని అమెరికా కోరుకుంటోంది.
ప్రస్తుత రూల్స్ప్రకారం.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి విదేశీ యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్‌లను మార్కెట్‌ప్లేస్‌లుగా మాత్రమే పనిచేయాలి. సొంతగా ఉత్పత్తులను అమ్మకూడదు. థర్డ్-పార్టీ సెల్లర్లకు, కొనుగోలుదారులకు మధ్య అనుసంధానం చేయాలి. భారతదేశం అమెరికా డిమాండ్లకు తలొగ్గితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు.. రిలయన్స్ రిటైల్, టాటా న్యూ వంటి భారతీయ కంపెనీలతో నేరుగా పోటీపడవచ్చు.