స్టాక్ మార్కెట్లో మహాసంక్షోభం.. వార్నింగ్​ బెల్​ మోగింది..

ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు అనేక కారణాలతో ఈవారం  (May 6 t0 11) భారీ ఒడిదొడుకుల్లో కొనసాగాయి. అయితే చాలా కాలంగా దేశీయ స్టాక్ మార్కెట్లు తమ బుల్ ర్యాలీని కొనసాగించి.... ప్రస్తుతం ఈ బుల్ జోరు చివరి అంకానికి వచ్చినట్లు నిపుణుల అంచనాలు చెప్పకనే చెబుతున్నాయి. 

వాస్తవానికి భారత స్టాక్ మార్కెట్లు ప్రపంచ మార్కెట్లు ఆసియా, అమెరికా మార్కెట్లను చాలా సార్లు అనుకరిస్తాయి.  ఈ క్రమంలోనే ఒక నివేదిక ప్రకారం భవిష్యత్తులో భారీ కుదుపునకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ మేనేజర్ గ్రాంట్ కార్డోన్ యూఎస్ మార్కెట్ విలువలను సగానికి తగ్గించారు. ఇది లక్షల మంది సేవింగ్స్, రిటైర్మెంట్‌పై ప్రభావం చూపే గణనీయమైన స్టాక్ మార్కెట్ కరెక్షన్ జరగొచ్చని  బులియన్​ నిపుణులు అంచనా వేశారు.

వాస్తవానికి అమెరికా మార్కెట్లలో బెంచ్ మార్క్ సూచీ అయిన డౌ జోన్స్‌లో ఇటీవలి లాభాలు ఉన్నప్పటికీ.. S&P 500 ఇన్వర్టెడ్ ఈల్డ్ కర్వ్‌ను కార్డోన్ ఎత్తిచూపారు. ఇది చారిత్రాత్మకంగా ప్రధాన మార్కెట్ తిరోగమనాలకు రాబోయే ఉపద్రవాన్ని ముందుగా సూచించే సూచీగా ఉంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం రేట్లు నష్టాలను 75%కి దగ్గరగా ఉంచగలవని హెచ్చరించాడు. ప్రస్తుత మార్కెట్ సూచికల ప్రకారం ..  గత ఆర్థిక సంక్షోభాలకు ముందు ఉన్న వాటి మధ్య సమాంతరాలను కలిగి ఉంది.

 వాస్తవానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపుదల ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో విఫలమైందని, హౌసింగ్ మార్కెట్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిందని కార్డోన్ విమర్శించారు. ఒకవేళ యూఎస్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపులు ప్రకటిస్తే ద్రవ్యోల్బణం పెరిగటం తిరిగి పునరుద్ధరించగలవని అన్నారు.  ఈ క్రమంలో ఫైనాన్షియల్ గురు ఆర్థిక సంక్షోభం నుంచి రక్షణ పొందాలంటే ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లు, రిటైర్మెంట్ ఫండ్స్ నుంచి తమ డబ్బును రియల్ అసెట్స్‌లోకి మార్చాలని సూచించారు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల్లోకి డబ్బును పార్క్ చేయాలని సూచించారు. అయితే అమెరికా మార్కెట్లు పతనమైతే ఖచ్చితంగా ఆ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై కూడా తప్పక ఉంటుందని ఇండియన్ ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి.

భారతీయ ఇన్వెస్టర్లకు హెచ్చరిక..

ప్రస్తుతం చాలా మంది భారతీయ ఇన్వెస్టర్లు కొన్ని బ్రోకరేజ్ సంస్థలు అందిస్తున్న ఫెసిలిటీ వినియోగించుకుని ఇక్కడి నుంచి అనేక యూఎస్ స్టాక్స్ లో తమ పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. ఫారెన్ ఫండ్స్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి వాటిలో అధిక లాభాల కోసం డబ్బును పార్క్ చేశారు. ఇలాంటి ఇన్వెస్టర్లు కార్డోన్ తాజా హెచ్చరికలతో తప్పక అప్రమత్తం కావాల్సి ఉంది.  ఇదే క్రమంలో చాలా మంది పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా విదేశీ కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెడుతున్నారు. వారు వారి విలువైన సొమ్ము లేదా పెట్టుబడులను అక్కడి నుంచి ఇతర సాధనాల్లోకి మార్చుకుని సురక్షితమైన రాబడులను అందించే చోట ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి పెట్టుబడిదారులు నేరుగా యూఎస్ మార్కెట్లలో పతనంతో భారీ నష్టాలు చవిచూడాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.