ట్రంప్‌ యూటర్న్‌..వందలమంది విద్యార్థులకు భారీ రిలీఫ్

ట్రంప్‌ యూటర్న్‌..వందలమంది విద్యార్థులకు భారీ రిలీఫ్

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న వందల మంది విద్యార్థులకు భారీ రిలీఫ్​దక్కింది. వారి వీసాలు/చట్టబద్ధ హోదాను రద్దు చేస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయంపై ట్రంప్‌ యూటర్న్‌ తీసుకున్నారు. ఆ విద్యార్థుల లీగల్‌ స్టేటస్‌ను పునరుద్ధరించారు. ఈమేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ న్యాయవాది తాజాగా వెల్లడించారు.

అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. విదేశీ విద్యార్థులపైనా ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే వివిధ కారణాలతో 187 కాలేజీలకు చెందిన 1,200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా లేదా వారి చట్టబద్ధ హోదాలను రద్దు చేసింది. దీనిపై విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. కాలిఫోర్నియా, బోస్టన్‌ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. 

►ALSO READ | తటస్థ విచారణకు సిద్ధం: మౌనం వీడిన పాక్ ప్రధాని

వీటిపై విచారణ జరిపిన ఆయా న్యాయస్థానాలు.. విద్యార్థుల వీసా రద్దును ఆపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఆయా విద్యార్థుల చట్టబద్ధ హోదాను తాత్కాలికంగా పునరుద్ధరించింది.