మంచి మనసు చాటుకున్న జో బైడెన్ మన పురాతన వస్తువులు మనకిచ్చేశారు

మంచి మనసు చాటుకున్న జో బైడెన్ మన పురాతన వస్తువులు మనకిచ్చేశారు

ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా మన దేశానికి చెందిన 297 పురాతన వస్తువులు ఇండియాకు అప్పగించారు. అక్రమంగా అమెరికాకు రవాణా చేసిన అమూల్యమైన పురాతన వస్తువులను ఆ దేశ తిరిగి భారత్ కు ఇచ్చేసింది. ఈ విషాయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ లో ప్రకటించారు. భారత్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 297 పురాతన వస్తువులను తిరిగి ఇచ్చినందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 2014 నుంచి ఇండియా 640 పురాతన వస్తువులను పలు దేశాల నుంచి స్వాధీనం చేసుకుంది. 

అందులో అమెరికా తిరిగి ఇచ్చిన వస్తువులే 578. పురాతన సాంస్కృతిక ఆస్తుల అక్రమ రవాణా అనేది చరిత్రలో అనేక సంస్కృతులను, దేశాలను ప్రభావితం చేస్తోన్న దీర్ఘకాలిక సమస్య. ఇండియా ఈ సమస్య వల్ల చాలా ప్రభావితం అయ్యింది. మన దేశం నుంచ పెద్ద సంఖ్యలో పురాతన వస్తువులు అక్రమంగా రవాణా చేయబడ్డాయి.

సాంస్కృతిక సంబంధాలను మరింతగా పెంచడం, సాంస్కృతిక ఆస్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడం అవసరం అని PM మోడీ X పోస్ట్‌ చేశారు. భారతదేశానికి 297 అమూల్యమైన పురాతన వస్తువులను తిరిగి ఇచ్చేలా హామీ ఇచ్చినందుకు అధ్యక్షుడు బిడెన్ మరియు US ప్రభుత్వానికి నేను చాలా కృతజ్ఞతలు అని తెలిపారు. మోదీ అమెరికాకు మూడు రోజుల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.