స్కూల్లో విద్యార్థిని కాల్పులు.. టీచర్ సహా ఐదుగురు మృతి

స్కూల్లో విద్యార్థిని కాల్పులు.. టీచర్ సహా ఐదుగురు మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. విస్కాన్సిన్  మాడిసన్ లోని అబండంట్ క్రిస్టియన్  స్కూల్లో ఫైరింగ్ జరిగింది. 12 వ తరగతికి చెందిన ఓ స్టూడెంట్.. విద్యార్థులపై కాల్పులు  జరిపాడు. ఘటనలో ఐదుగురు  చనిపోగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. నిందితుడు కూడా కాల్పుల్లో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. 

ALSO READ : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు యువతి మృతి.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు

కాల్పులతో 400 మంది విద్యార్థులున్న స్కూల్లో ఒక్కసారిగా భయాందోళనలు చోటు చేసుకున్నాయి. భారీ ఎత్తున పోలీసులు, వాహనాలు, అంబులెన్సులు, ఫైరింజన్లు స్కూల్ ను మోహరించాయి. ఘటనపై మాడిసన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  కాల్పులతో మరోసారి అమెరికాలో గన్ కల్చర్ పై  జోరుగా డిస్కషన్ జరుగుతోంది. గన్ కంట్రోల్, స్కూల్ సెక్యూరిటీ అమెరికాలో పొలిటికల్, సొషల్  ఇష్యూగా మారింది.  ఈ ఏడాదిలో అమెరికాలో మొత్తం 322 కాల్పులు ఘటనలు  జరిగినట్లు ఓ రిపోర్ట్ లో తెలిపింది.